కొత్తపేట(గుంటూరు): జిల్లాలో జల గండం పొంచి ఉంది. భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటి పోవడమే ఇందుకు కారణం. తీవ్ర వర్షాభావం కారణంగా కుంటలు, చెరువులు ఎండిపోవటంతో పరిస్థితి ఆందోళనకరంగా తయూరైందని నిపుణులు చెబుతున్నారు. పల్నాడు ప్రాంతంతోపాటు గుంటూరు నగరంలోనూ భూగర్భ జల మట్టం బాగా పడిపోరుుంది. గత నెలలో జిల్లా సగటు భూగర్భ జల మట్టం -6.663 మీటర్లుగా నమోదైంది.
భూగర్భ జలాలు అడుగంటడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షాభావం, అశాస్త్రీయ పట్టణీకరణ ఈ సమస్యకు ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.పల్నాడు ప్రాంతంలోని దుర్గి, వె ల్దుర్తి, మాచర్ల, బొల్లాపల్లి మండలాల్లో 300 మీటర్ల లోతు వరకు వెళ్లినా నీటి జాడ కనిపించడం లేదు.
గుంటూరులోని గుజ్జనగుండ్ల, చంద్రమౌళినగర్, విద్యానగర్, లక్ష్మీపురం, కొరిటెపాడు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లోని భారీ అపార్ట్‌మెంట్లలో 600 నుంచి వెరుు్య అడుగుల లోతు వరకు బోర్లు తవ్వటం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా తయూరైంది.
ఇవీ లెక్కలు
జిల్లాలోని భూగర్భ జల మట్టాలను అధికారులు నెలకొకసారి 125 పిజోమీటర్ల ద్వారా పరిశీలించి వివరాలు నమోదు చేస్తుంటారు. వీటి ప్రకారం ఈ ఏడాది మే నెలలో తెనాలి డివిజన్‌లో 4.59 మీటర్లు, నరసరావుపేట డివిజన్‌లో 6.45 మీటర్లు, గుంటూరు డివిజన్‌లో 14.59 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నారుు. 2012లో జిల్లా సగటు భూగర్భ జలమట్టం -6.910 మీటర్లు కాగా 2013లో-7.838 మీటర్లు, ఈ ఏడాది జూన్ నాటికి -6.663 మీటర్లుగా నమోదైంది.
దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి...
పరిస్థితి మరింత దిగజారకుండా చూసేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా అపార్లమెంట్లలో భారీ బోర్ల తవ్వకాన్ని నిరోధించాలని, ఇంకుడు గుంతల తవ్వకాన్ని తప్పనిసరి చేయూలని పేర్కొంటున్నారు.
జల గండం
Published Wed, Jul 30 2014 12:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement