ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైనాకు ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది ఆమెను శాలువాతో సన్మానించారు.
శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం నైనా జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘‘అలలకు అలుపు లేదు.. శిలలకు చూపు లేదు.. కాలాలకు రూపు లేదు.. మౌనానికి భాష లేదు.. కానీ, ఆ గోవింద నామాలకు అంతులేదు’’ అంటూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. సర్వేజనా సుఖీనోభవంతని తాను కోరుకున్నానని ఆమె చెప్పారు.
కాగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్.. చదువుల తల్లి.. కుంగుబాటుకు లోనైన బలహీన మనస్కుల్లో సానుకూల దృక్పథాన్ని నింపే మోటివేషనల్ స్పీకర్.. ‘వరల్డ్ పీస్ అంబాసిడర్’గా గుర్తింపు పొందారు నైనా. 17 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ మొదలుపెట్టిన ఆమె 22 ఏళ్లకు పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. దేశంలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.
నైనా జైశ్వాల్ స్ఫూర్తిదాయక ఇంటర్వ్యూ
Comments
Please login to add a commentAdd a comment