జగిత్యాల : పెద్దలు తీసుకునే చిన్నపాటి నిర్ణయాల వల్ల... అవి నచ్చని చిన్నారులు బలన్మారణాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. తాజాగా సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌కు జరిగిన ఘటనతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
రోహిత్ (17) గత కొంతకాలంగా సెల్‌ఫోన్ కావాలని అడుగుతున్నాడు. దీనికి తల్లిదండ్రులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపనికి గురైన రోహిత్ బుధవారం ఇంట్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు గదిలోంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చూసే సరికి రోహిత్ మరణించి ఉన్నాడు.