person murdered
-
ఆటో డ్రైవర్‌ను హతమార్చిన కానిస్టేబుల్
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ ఆటో డ్రైవర్‌ను చితకబాది హతమార్చాడు. ఈ సంఘటన నగరంలోని సైదాబాద్ గ్రీన్‌పార్క్ కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వినోద్ నగరంలో ఉంటున్నాడు. అయితే మద్యం మత్తులో వినోద్ వీరంగం చేశాడు. ఆటో డ్రైవర్ సిర్ నాయక్‌ను చితకబాదడంతో పాటు హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు కానిస్టేబుల్ వినోద్‌ను పట్టుకుని కాళ్లూ చేతులు కట్టేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బండరాళ్లతో మోది వ్యక్తి హత్య
నల్లగొండ: గుర్తుతెలియని వ్యక్తి (30)ని కొందరు దుండగులు బండరాళ్లతో మోది చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామపంచాయతి పరిధిలోని ఏడుకోట్లతండ సమీపంలో గొర్రెల కాస్తున్న వ్యక్తులకు ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వంటిపై ఉన్న దుస్తులు.. వేళ్లకు ఉన్న ఉంగరాలను బట్టి గొర్రెల కాపరిగా అనుమానిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పాలమూరుకు చెందిన కొందరు గొర్లకాపరులు సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో.. ఈ హత్య రెండు రోజుల కిందటే జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
బావమరిది చేతిలో బావ హతం
హైదరాబాద్: మద్యం తాగి అక్కను వేధిస్తున్నాడన్న కారణంతో బావను కర్రతో కొట్టి హత్య చేసిన బావమరిదిని సైదాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణికాలనీలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ రత్నావత్ పాండు బుధవారం రాత్రి పీకల దాకా తాగి వచ్చి తన భార్య బుజ్జితో గొడవపడ్డాడు. దీంతో అక్కడే సమీపంలో నివాసముంటున్న ఆయన బావమరిది లక్ష్మణ్ ఇంటికి వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేశాడు. అయినా పాండు వినకపోవడంతో పక్కనే ఉన్న వెదురు కర్రతో తలపై కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో పాండు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. -
వివాహేతర సంబంధమే ఉసురు తీసింది
గద్వాలటౌన్(మహబూబ్‌నగర్): నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని గద్వాల టౌన్ పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఆ దారుణానికి కారణమని తేల్చారు. గద్వాల డీఎస్పీ బాలకోటి తెలిపిన వివరాలివీ.. మండలంలోని చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన రాముడు మేస్త్రీ పనిచేస్తుంటాడు. అతని భార్య సుజాతకు గద్వాలకు చెందిన తెలుగు దర్శెల్లి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో చనువుగా ఉంటున్న విషయం తెలుసుకున్న రాముడు పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో అతడిని తమకు అడ్డుగా భావించి అంతమొందించాలనుకున్నారు. తెలుగు దర్శెల్లి తనకు సన్నితులుగా ఉన్న దౌదర్పల్లికి చెందిన జాన్, స్థానిక రాంనగర్‌కు చెందిన వెంకటేష్‌తో కలసి పథకం వేశాడు. దాని ప్రకారం ఈనెల 2వ తేదీ రాత్రి చెనుగోనిపల్లి నుంచి బైక్‌పై రాముడు గద్వాలకు వస్తున్న విషయాన్ని సుజాత ద్వారా తెలుసుకుని, గ్రామ శివారులో మాటువేసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. సమీపంలోని బావిలో రాముడు మృతదేహాన్ని పడవేశారు. ఈనెల 3వ తేదీ ఉదయం సుజాత ఏడుస్తూ భర్త కన్పించడం లేదని బంధువులకు చెప్పగా వారు అనుమానం వచ్చి నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సుజాతను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా నేరం అంగీకరించింది. హత్యకు పాల్పడిన ప్రియుడు తెలుగు దర్శెల్లితో పాటు అతనికి సహకరించిన జాన్, వెంకటేష్, సుజాతలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి (హయత్‌నగర్): హయత్‌నగర్ మండలంలోని కోహెడ గ్రామ శివారులో మంగళవారం రాత్రి గుర్తుతెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తాడుతో మెడకు ఉరిబిగించి చంపినట్లు అనుమానిస్తున్నారు. చంపిన తర్వాత చెట్లపొదల్లో మృతదేహాన్ని పడవేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో మద్యం సీసాలు ఉన్నాయి. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులుకి సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.