hockey stick
-
అతిపెద్ద హాకీ స్టిక్ సైకత శిల్పంగా ప్రపంచ రికార్డు
దేశంలో పురుషుల హాకీ ప్రపంచకప్ జరుగుతున్నందున ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ అతిపెద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ మేరకు ఆయన అతి పెద్ధ హాకీ స్టిక్ రూపంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. దీన్ని లాభాప్రేక్షలేని సంస్థ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద సైకత హాకీ స్టిక్‌గా గుర్తించింది. ఒడిశాలో కటక్‌లోని మహానది ఒడ్డున సుమారు 5 వేల హాకీ బంతులతో 105 అడుగుల పొడవైన సైకత శిల్పాన్ని పట్నాయక్ రూపొందించారు. ఈ క్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ..వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికేట్ పొందడం చాలా సంతోషంగా ఉంది. (చదవండి: ప్రయాణికుడు చేసిన తప్పిదం..విమానం టేకాఫ్‌కు ముందే..) -
డబ్బులివ్వలేదని తల్లిపై హాకీస్టిక్‌తో దాడి
హసన్‌పర్తి: డబ్బులు ఇవ్వనందుకు ఓ కుమారుడు హాకీ కర్రతో తల్లిపై దాడి చేశాడు. గొడవను నివారించడానికి వచ్చిన మరో ఇద్దరిని చితకబాదాడు. ఈ సంఘటనలో తల్లి చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండ్లసింగారానికి చెందిన అప్పల రమ్య (45) కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటోంది. వ్యక్తిగత అవసరం కోసం కుమారుడు రోహిత్ రోజూ డబ్బుల కోసం తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట డబ్బుల కోసం తల్లితో గొడవ పడ్డాడు. లేవని చెప్పడంతో క్షణికావేశానికి గురైన రోహిత్.. హాకీ కర్రతో తల్లి కడుపు, తల, వీపుపై బలంగా కొట్టాడు. అడ్డువచ్చిన మామ సతీశ్, అమ్మమ్మ, అక్కలను చితకబాదాడు. ఈ ఘటనలో రమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా శుక్రవారం రాత్రి ఆమె మృతిచెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శనివారం మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిం చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జనార్దన్‌రెడ్డి చెప్పారు. -
ఆడపిల్ల పుట్టిందని అమానుషం
పంజాబ్: ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అమానుషానికి పాల్పడిందో కుటుంబం. సమీప బంధువు, మరో వ్యక్తి ఓ మహిళపై హాకీ స్టిక్స్‌తో విచక్షణారహితంగా దాడి చేయడం ఆందోళన రేపుతోంది. పంజాబ్‌లోని పాటియాలాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బహిరంగంగా ఆమెపై ఆ దుర్మార్గులు దారుణంగా దాడి చేస్తోంటే, అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. తాజా నివేదికల ప్రకారం మీనా కశ్యప్, దల్జీత్ సింగ్ కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. పెళ్లి అయన దగ్గర్నుంచి అత్తింటివారు మీనాను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు మితిమీరడంతో మీనా, దల్జీత్ వేరు కాపురముంటున్నారు. ఇంతలో మీనా ఈ మధ్యనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతే దీన్ని సాకుగా చేసుకున్న ఆ కుటుంబం మరింత రెచ్చిపోయింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ దల్జీత్ సోదరుడు, అతని స్నేహితుడు ఆమెను హాకీస్టిక్‌లతో అతి దారుణంగా కొట్టారు. హృదయ విదారకంగా అరిచి గగ్గోలు పెడుతున్నా ..ఎంత వేడుకున్నా వదిలిపెట్టలేదు. సోషల మీడియాలో వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ విషయమే గత ఏడాదిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ,కానీ ఎలాంటి ఫలితంలేదని మీనా తండ్రి వాపోయారు. రూ.7లక్షల కట్నాన్ని డిమాండ్ చేశారని తెలిపారు. -
హీరోను హాకీ స్టిక్ తో తరిమేసింది!
ముంబై: హీరో ఆమిర్ ఖాన్ ను హాకీ స్టిక్‌తో తరిమానని బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఆసక్తికర విషయం వెల్లడించింది. 1990 దశకంలో సూపర్ హిట్టైన 'దిల్' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న సరదా సంగతిని మాధురి గుర్తు చేసుకుంది. 'దిల్' షూటింగ్ సెట్ లో ఆమిర్ ఖాన్ తనను ఆట పట్టించడంతో అతడిని హాకీ స్టిక్ తో వెంబడించానని తెలిపింది. తన జీవితంలో చేసిన సరదా పనుల్లో అత్యంత కొంటె పని ఇదేనని ట్విటర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో వెల్లడించింది. 1984లో 'ఆబొద్' సినిమాతో మాధురి సినిమా కెరీర్ పారంభమైంది. వరుస ఫ్లాపుల తర్వాత తేజాబ్'తో తొలి హిట్ అందుకుంది. తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. 2014లో చివరిసారిగా 'గులాబ్ గ్యాంగ్' తెరపై కనిపించింది. మిమ్మల్ని ఇన్స్పెర్ చేసిన నటీనటులు ఎవరని అడగ్గా... ప్రత్యేకంగా ఎవరి పేరు చెప్పలేదు. బాగా నటించేవారికి చూసి ప్రేరణ పొందుతానని చెప్పింది.