హీరోను హాకీ స్టిక్ తో తరిమేసింది! | When Madhuri Dixit chased Aamir Khan with hockey stick | Sakshi
Sakshi News home page

హీరోను హాకీ స్టిక్ తో తరిమేసింది!

Published Wed, Jun 1 2016 1:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

హీరోను హాకీ స్టిక్ తో తరిమేసింది!

హీరోను హాకీ స్టిక్ తో తరిమేసింది!

ముంబై: హీరో ఆమిర్‌ ఖాన్ ను హాకీ స్టిక్తో తరిమానని బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఆసక్తికర విషయం వెల్లడించింది. 1990 దశకంలో సూపర్ హిట్టైన 'దిల్' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న సరదా సంగతిని మాధురి గుర్తు చేసుకుంది. 'దిల్' షూటింగ్ సెట్ లో ఆమిర్‌ ఖాన్ తనను ఆట పట్టించడంతో అతడిని హాకీ స్టిక్ తో వెంబడించానని తెలిపింది. తన జీవితంలో చేసిన  సరదా పనుల్లో అత్యంత కొంటె పని ఇదేనని ట్విటర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో వెల్లడించింది.

1984లో 'ఆబొద్' సినిమాతో మాధురి సినిమా కెరీర్ పారంభమైంది. వరుస ఫ్లాపుల తర్వాత తేజాబ్'తో తొలి హిట్ అందుకుంది. తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. 2014లో చివరిసారిగా 'గులాబ్ గ్యాంగ్' తెరపై కనిపించింది. మిమ్మల్ని ఇన్స్పెర్ చేసిన నటీనటులు ఎవరని అడగ్గా... ప్రత్యేకంగా ఎవరి పేరు చెప్పలేదు. బాగా నటించేవారికి చూసి ప్రేరణ పొందుతానని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement