యూపీలో దారుణం.. యువకుడ్ని చితకబాది మొహంపై మూత్ర విసర్జన.. | Uttar Pradesh Man Beaten Urinated Upon In Gang Rivalry | Sakshi
Sakshi News home page

యూపీలో దారుణం.. యువకుడ్ని చితకబాది మొహంపై మూత్ర విసర్జన..

Published Fri, Nov 18 2022 6:38 PM | Last Updated on Fri, Nov 18 2022 6:38 PM

Uttar Pradesh Man Beaten Urinated Upon In Gang Rivalry - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ గోండా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడిపై మరికొంతమంది యువకుల గ్యాంగ్ దాడి చేసింది. అనంతరం అతడిపై సదరు గ్యాంగ్‌లోని వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటన జరిగిన రెండు వారాల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.

వీడియో చూసిన అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. అతని పేరు కప్తాన్ సింగ్ అని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే బాధితుడి ఇంటికివెళ్లి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే స్థానికంగా ఉండే రెండు గ్యాంగ్‌లు ఆధిపత్యం కోసం తరచూ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‍‍అక్టోబర్ 31న కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి కప్తాన్ సింగ్ నాయకత్వం వహించగా.. మరో వర్గానికి బాధితుడు శివ సింగ్‌ లీడర్‌గా ఉన్నాడు. ఈ గొడవలో శివ గ్యాంగ్ ఓడిపోయింది. దీంతో అతడ్ని చితకబాది మూత్ర విసర్జన చేసింది కప్తాన్ సింగ్ గ్యాంగ్.

శివ సింగ్, కప్తాన్ సింగ్‌లపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కప్తాన్ సింగ్ ఇటీవలే బెయిల్‌పై విడుదలై బయటకి వచ్చినట్లు వివరించారు. ఓ హత్య చేసింది తానే అని ఒప్పుకోవాలని శివ సింగ్‌ను కప్తాన్ సింగ్ బెదిరించినట్లు పేర్కొన్నారు.
చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement