gangs
-
సిటీలోనే షెల్టర్? బిహార్ నుంచి వచ్చి ఇక్కడే మకాం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్‌తో పాటు మన నగరంలోని అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో తుపాకీతో విరుచుకుపడిన దుండగులు ఇక్కడే షెల్టర్ తీసుకున్నారా? అంటే.. ఔననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నగరంలో వీరి వ్యవహారశైలి, నేరం జరిగిన తీరు, వినియోగించిన వాహనంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఈ అంచనాకు వచ్చారు. దీంతో దుండగులు బస చేసే అవకాశం ఉన్న ప్రాంతాల కోసం ఆరా తీస్తున్నారు. మరోపక్క దుండగులు గురువారం సాయంత్రం ట్రాలీ బ్యాగ్స్ కంటే ముందే కొత్త బ్యాక్ ప్యాక్ సైతం ఖరీదు చేశారు. రోషన్ ట్రావెల్స్ పక్కన ఉన్న దోశ కింగ్ హోటల్లోనే తమ బ్యాగ్‌లో నుంచి తుపాకీ తదితరాలను తీసి కొత్త బ్యాక్ ప్యాక్‌లో పెట్టుకున్నట్లు తేలింది. బిహార్ టు బీదర్ వయా సిటీ.. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు హైదరాబాద్ మీదుగానే బీదర్ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన వారుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వచ్చారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్ ఉంది. ఇది అసలుదైనా, నకిలీదైనా వాహనం మాత్రం హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీ చేసిందని భావిస్తున్నారు. చోరీ చేసిన వాహనంతోనే రెక్కీ? నగరంలోని ఒక లాడ్జిలో రెండు మూడు రోజులు బస చేసిన దుండగులు చోరీ చేసిన వాహనం పైనే బీదర్ వెళ్లి వస్తూ రెక్కీ చేసి ఉంటారని, అందుకే నేరం చేసిన తర్వాత కూడా రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. శనివారం బీదర్ పోలీసులతో కలిసి చేసిన తనిఖీల నేపథ్యంలో రెండు అనుమానాస్పద వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. వీటిలో దుండగులు వాడింది ఏదనేదానిపై ఆరా తీస్తున్నారు. తిరుమలగిరి నుంచి మళ్లీ వెనక్కి... ఈ నేరగాళ్లకు హైదరాబాద్‌లోని ప్రాంతాలు, రహదారులకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ తర్వాత అక్కడ నుంచి ఆటోలో ఎస్కేప్ అయ్యారు. సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్ద ఆటో దిగిన దుండగులు డ్రైవర్‌కు డబ్బు ఇచ్చి పంపేశారు. ఆపై అక్కడ నుంచి మరో ఆటో మాట్లాడుకుని తిరుమలగిరి చౌరస్తాకు చేరుకున్నారు. ఆ ఆటో కూడా దిగిపోయిన ఇరువురూ రోడ్డు దాటి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పాత బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్‌తో పాటు వ్రస్తాలను పడేశారు. ఆపై రోడ్డు మీదికి వచ్చి మరో ఆటో ఎక్కారు. ఆ ఆటో తిరిగి సికింద్రాబాద్ వైపే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో ఈ ఆటో ఎటు వెళ్లిందో తెలుసుకోవడంతో పాటు డ్రైవర్‌ను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నాలుగు ప్రాంతాల్లో లోతుగా ఆరా... శనివారం ఉదయం నుంచి ఈ నేరానికి ముందు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుండగులు బస చేసి ఉంటారనే అనుమానంతో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, అఫ్జల్‌గంజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని లాడ్జిల్లో ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అధికారులకు కీలక ఆధారం దొరికినట్లు సమాచారం. మనీష్ గ్యాంగ్ పనేనా? బీదర్‌తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మనీష్ కుషా్వహా అంటూ సమాచారం ఇచ్చారు. అతని కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. బిహార్ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్ తల్లిదండ్రులకు చూపించారు. వాళ్లు అది తమ కుమారుడి ఫొటో కాదని చెప్పడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చింది. వారిచెప్పింది వాస్తవమా? కాదా? నేరం చేసింది మనీష్ నేతృత్వంలోని గ్యాంగ్ కాదా? అనే కోణాలను పరిశీలిస్తున్నారు. పోలీసుల వద్ద తుపాకీ ఉండాల్సిందే ‘సాక్షి’ కథనానికి స్పందించిన సిటీ సీపీఅఫ్జల్గంజ్ కాల్పుల ఉదంతం నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ‘సరి చేయకుంటే సమస్యలెన్నో!’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై కొత్వాల్ సీవీ ఆనంద్ స్పందించారు. దీనిపై ఆయన శనివారం ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉండే పోలీసులు, టాస్క్‌ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమ వెంట తుపాకులు ఉంచుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం కోసం పని చేసే అధికారులు తమ వెంట కచి్చతంగా పోలీసు విభాగం ఇచి్చన తుపాకీ ఉంచుకోవాలని స్పష్టం చేశారు. వీరితో పాటు ప్రత్యేక విభాగాల్లో పని చేస్తున్న వారిలో ఎవరికైనా తుపాకీ జారీ అనివార్యమైతే ఆ కోణంలో తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తమ వద్ద ఉండే తుపాకులను కేవలం అత్యవసర సందర్భాలు, అవసరమైనప్పుడు మాత్రమే వాడాలని ఆనంద్ స్పష్టం చేశారు. కేవలం తుపాకీ కలిగి ఉండటమే కాదని... క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించాలని కొత్వాల్ నిర్ణయించారు. లా అండ్ ఆర్డర్‌తో పాటు అన్ని విభాగాల్లో పని చేస్తున్న వారితో దశల వారీగా దీన్ని చేయించాలని స్పష్టం చేశారు. నగరంలో పని చేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడంతో పాటు కొత్తవాటి ఏర్పాటు, అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీవీ ఆనంద్ నిర్ణయించారు. -
అసలే అక్రమం... ఆపై నకిలీ!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి నకిలీ, అక్రమ ఔషధాలను తీసుకువచ్చి వివిధ ఆస్పత్రులతో పాటు సామాన్యులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును సౌత్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులున్న ముఠాలో ఇద్దరిని అరెస్టు చేసి రూ.28.72 లక్షల విలువైన ఔషధాలు స్వాదీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శనివారం వెల్లడించారు. కర్మన్‌ఘాట్‌కు చెందిన పోకల రమేష్, పెద్ద అంబర్‌పేట వాసి బి.రాఘవరెడ్డి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇందులో తీవ్రనష్టాలు రావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించారు. రమేష్ కు సమీప బంధువైన పూర్ణచంద్రరావుకు ఫార్మ రంగంలో అనుభవం ఉంది. గతంలో ఆల్ఫాజోలమ్ టాబ్లెట్లు అక్రమంగా విక్రయిస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కాడు. ఇతగాడు ఉత్తరాది నుంచి అక్రమ, నకిలీ ఔషధాలను సిటీకి తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిద్దామంటూ సలహా ఇచ్చాడు. లైసెన్సు లేకపోయినా ఈ దందాలోకి దిగిన వీరితో పాటు లక్ష్మణ్ అనే వ్యక్తి కూడా ముఠాలో చేరాడు. వీరంతా కలిసి ఉత్తరప్రదేశ్‌కు చెందిన నదీమ్, ఢిల్లీ వాసి అరుణ్ చౌదరి నుంచి ఈ ఔషధాలను తక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. ఎలాంటి బిల్లులు, పత్రాలు లేకుండానే కొరియర్లో సిటీకి రప్పిస్తున్నారు. ఈ ఔషధాలను మార్కెట్ రేటు కంటే 30 నుంచి 40 శాతం తక్కువ ధరకు అమ్ముతూ రోగులను ఆకర్షిస్తున్నారు. కొన్ని ఆస్పత్రులకు సైతం వీటిని సరఫరా చేస సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా వ్యవహారాలపై ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్సై మహ్మద్ ముజఫర్ తన బృందంతో వలపన్నారు. శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రి వద్ద రమేష్, రాఘవలను పట్టుకున్నారు. వీరి నుంచి స్వాదీనం చేసుకున్న ఔషధాల్లో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, అరిస్టో సహా వివిధ కంపెనీల పేర్లతో ఉన్న వాటితో పాటు ఆస్పత్రులకు సరఫరా అయ్యే ‘నాట్ ఫర్ సేల్’ మందులు కూడా ఉన్నాయి. ఈ ముఠా కొన్ని ఔషధాలను వివిధ వైద్యశాలలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. కేసును మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. -
వేలి ముద్రలు వేస్తున్నారా?.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే..
వైఎస్సార్ జిల్లాలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు ఎవరో విత్‌డ్రా చేశారని పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై కడప పోలీసులు విచారణ చేపట్టగా.. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా దందా సాగిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల ముఠా గుట్టు రట్టయింది. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న దందా బట్టబయలైంది. కడప పోలీసులు ఈ కేసును విజయవంతంగా ఛేదించి సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. విశాఖపట్నంలో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.1.50 లక్షలు గల్లంతయ్యాయి. దీనిపై విచారించగా హరియాణలోని ఓ ముఠా దందా వెలుగుచూసింది. ఆన్లైన్లో రుణాలు ఇస్తామని చెప్పి ఓ సంస్థ ఆయన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు కాపీలతోపాటు వేలిముద్రలు కూడా తీసుకుంది. అనంతరం క్లోనింగ్ ద్వారా ఆయన బ్యాంకు ఖాతాల్లోని నగదును విత్‌డ్రా చేసేసింది. సాక్షి, అమరావతి: దేశంలో కొత్తరూపు సంతరించుకుంటున్న సైబర్ నేరాలకు తాజా ఉదాహరణలు ఇవి. ఏఈపీఎస్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్ ద్వారా వారి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ తరహా సైబర్ నేరాలు అధికమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ప్రకారం గత ఆరునెలల్లో దాదాపు నాలుగువేల కేసులు నమోదవడం ఈ తరహా సైబర్ నేరాల తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ రీతిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు అత్యధికంగా హరియాణలో కేంద్రీకృతం కాగా.. మరికొన్ని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ల నుంచి దందా సాగిస్తున్నాయని సైబర్ పోలీసుల విభాగం గుర్తించింది. సైబర్ మోసం ఇలా.. సైబర్ నేరగాళ్లు ఏఈపీఎస్ను దుర్వినియోగం చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదును కొట్టేస్తున్నారు. అందుకోసం రెండుమూడు తరహాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా వివిధ వెబ్సైట్ల నుంచి వ్యక్తుల వేలిముద్రలను ‘బటర్ పేపర్’పై కాపీచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ, ట్రెజరీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, ఆన్లైన్ రికార్డుల్లో నమోదైన వేలిముద్రలను కాపీచేస్తారు. అనంతరం క్లోనింగ్ ద్వారా నకిలీ సిలికాన్/రబ్బర్ వేలిముద్రలు తయారు చేస్తారు. ఆధార్ నంబరు అనుసంధానమైన వ్యక్తుల పేరిట ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. దీంతో ఆ వ్యక్తుల అసలైన ఆన్లైన్ ఖాతాలు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌లు వారి నియంత్రణలోకి వస్తాయి. అనంతరం తాము క్లోనింగ్ చేసిన వేలిముద్రలు ఉపయోగించి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మరికొన్నిసార్లు బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్స్, ఏజెంట్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్లో బయోమెట్రిక్ డివైజ్ స్కానర్స్తో స్కాన్‌చేసి నగదు లాగేస్తున్నారు. మరికొన్ని ముఠాలు ఏకంగా ఆన్లైన్ రుణ కంపెనీల పేరిట నకిలీ సంస్థలను ప్రారంభిస్తున్నాయి. రుణాలు ఇస్తామని ఆన్లైన్లో ప్రకటనలు చేస్తున్నాయి. రుణాల కోసం తమను సంప్రదించే వ్యక్తుల పాన్‌కార్డులు, ఆధార్‌కార్డుల కాపీలు, వేలిముద్రలు కూడా తీసుకుంటున్నాయి. అనంతరం క్లోనింగ్ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును తస్కరిస్తున్నాయి. ఆధార్ నంబర్లతో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోని నగదును పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా కూడా సిఫోనింగ్ చేసి మరీ ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఇలా పలు రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తతే శ్రీరామరక్ష బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అందుకు ఖాతాదారులతోపాటు ప్రభుత్వ సంçÜ్థలకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ♦కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ వెబ్సైట్లను ఎవరూ హ్యాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦తమ వెబ్సైట్లను తరచు సేఫ్టీ ఆడిట్ చేయాలి. ♦ప్రజల వ్యక్తిగత సమాచారం లీక్‌కాకుండా తగిన ప్రమాణాలు పాటించాలి. ♦అందుకోసం కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఖాతాదారులకు సూచనలు ఏఈపీఎస్ విధానాన్ని తరచు వినియోగించని ఖాతాదారులు ఆ సౌలభ్యాన్ని ఉపసంహరించుకోవాలి. వెబ్సైట్లలో తమ వేలిముద్రలు నమోదు చేయకూడదు. ఎటువంటి వ్యవహారం కోసమైనా సరే వేలిముద్రలు అడిగితే తిరస్కరించాలి. తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని గుర్తిస్తే 24 గంటల్లోనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దీంతో వారి ఖాతానుంచి నగదు బదిలీ అయిన ఖాతాను సైబర్ పోలీసులు స్తంభింపజేయడానికి అవకాశం ఉంటుంది. సైబర్ నేరం జరిగినట్టు తెలియగానే ఏపీ సైబర్‌మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100)నుగానీ, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930)ను గానీ సంప్రదించి ఫిర్యాదు చేయాలి. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
యూపీలో దారుణం.. యువకుడ్ని చితకబాది మొహంపై మూత్ర విసర్జన..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ గోండా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడిపై మరికొంతమంది యువకుల గ్యాంగ్ దాడి చేసింది. అనంతరం అతడిపై సదరు గ్యాంగ్‌లోని వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటన జరిగిన రెండు వారాల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. అతని పేరు కప్తాన్ సింగ్ అని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే బాధితుడి ఇంటికివెళ్లి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే స్థానికంగా ఉండే రెండు గ్యాంగ్‌లు ఆధిపత్యం కోసం తరచూ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 31న కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి కప్తాన్ సింగ్ నాయకత్వం వహించగా.. మరో వర్గానికి బాధితుడు శివ సింగ్ లీడర్‌గా ఉన్నాడు. ఈ గొడవలో శివ గ్యాంగ్ ఓడిపోయింది. దీంతో అతడ్ని చితకబాది మూత్ర విసర్జన చేసింది కప్తాన్ సింగ్ గ్యాంగ్. శివ సింగ్, కప్తాన్ సింగ్‌లపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కప్తాన్ సింగ్ ఇటీవలే బెయిల్‌పై విడుదలై బయటకి వచ్చినట్లు వివరించారు. ఓ హత్య చేసింది తానే అని ఒప్పుకోవాలని శివ సింగ్‌ను కప్తాన్ సింగ్ బెదిరించినట్లు పేర్కొన్నారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
‘గత నెల సుశాంత్ 50 సిమ్‌లు మార్చాడు’
పట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు వారాలకు పైనే అయినప్పటికి.. ఇంకా అతడి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు.. బాలీవుడ్ స్టార్లపై విమర్శలు ఆగడం లేదు. ఈ క్రమంలో టెలివిజన్ హోస్ట్, నటుడు శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లోని బంధుప్రీతి వల్ల సుశాంత్ మరణించలేదని.. ఇండస్ట్రీలోని గ్యాంగ్‌ల వల్లే అతడు ఆత్యహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను కలిసిన శేఖర్ సుమన్ దీని గురించి చర్చించానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కంటికి కనిపించే దాని కంటే ఎక్కువగా ఏదో జరిగినట్లు సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటిని గమనిస్తే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి’ అన్నారు. అంతేకాక ఓ సిండికేట్, మాఫియా చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయని అన్నారు. ఇవే ఓ యువ నటుడి భవిష్యత్తును నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సిండికేట్‌లో భాగస్వాములైన స్టార్లందరు తనకు తెలుసని.. కానీ సరైన ఆధారాలు లేనందున వారి పేర్లు వెల్లడించడం లేదన్నారు.(‘సుశాంత్ మరణాన్ని ముందే ఊహించా’) ‘సుశాంత్ గత నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 50 సిమ్ కార్డులు మార్చాడు. ఎవరి నుంచి తప్పించుకోవడం కోసం అతడు ఇలా చేశాడు. వృత్తిపరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా తెలియాలి. బంధుప్రీతి వల్ల సుశాంత్ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. ఇండస్ట్రీలోనే గ్యాంగ్‌ల వల్లే సుశాంత్ మరణించాడు’ అంటూ శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ సింగ్ కుటుంబాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరామర్శించకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.(‘నా భర్త కూడా బాధితుడే.. నేను చూశాను’) -
యురేనియం మోసాలమయం..
సాక్షి, హైదరాబాద్: చిట్టీలు వేసి మోసం చేసిన వాళ్లను చూశాం. ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకొని బోర్డు తిప్పేసిన కంపెనీలను చూశాం. చివరకు కరక్కాయల పేరుతో లక్షలు దండుకున్న గ్యాంగునూ చూశాం. కానీ మెరుపులు, ఉరుములు పడితే యురేనియం, ఇరీడియం తీసిస్తామన్న నయా గ్యాంగ్‌ను చూశారా? అవును రెండు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉరుములు, మెరుపులు పడినా ఆ ప్రాంతం నుంచి విలువైన యురేనియం, ఇరీడియం ఖనిజాలను తీసిస్తామంటూ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. వీరి మాటలు నమ్మి అమాయకులు రూ. కోట్లల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో మూడు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు, పరీక్షలంటూ.. బెంగుళూరుకు చెందిన గంగాధర్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన కోహ్లీ బాబా ఇద్దరు ముఠాగా ఏర్పడ్డారు. కర్ణాటక, ఆం«ధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషాలోని పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పదవీవిరమణ పొందిన ఉద్యోగులను టార్గెట్ చేసి ఇరీడియం, యురేనియం పేరుతో బురిడీ కొట్టించారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రముఖ బిల్డర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ అధికారి ఇద్దరూ ఈ ముఠాను నమ్మి రూ. 4.5 కోట్లు పోగొట్టుకున్నారు. గంగాధర్‌రెడ్డి వీరితో పరిచయం పెంచుకొని బెంగుళూరు విమానాశ్రయ పరిధిలోని రసాయన కంపెనీలో యురేనియం నిలువ ఉందని, దాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ రక్షణ శాఖలో పని చేసే శాస్త్రవేత్త కోహ్లీ వస్తున్నాడని చెప్పి తీసుకెళ్లాడు. రూ. 4.5 కోట్లు టోకారా ఓ గదిలోని రసాయన పదార్థాన్ని పరిశీలించేందుకు గాను ఆ బిల్డరు, రిటైర్డ్ ఉద్యోగికి ప్రత్యేక జాకెట్లు, హెల్మెట్ పెట్టి లోపలికి పంపాడు. ఆ రసాయనాన్ని పరీక్షిస్తున్నట్లు కోహ్లీ నటించడం, వెంటనే అందులో నుంచి పొగలు రావడం చూపించి ఇది నిజమైన ఇరీడియమని, దీన్ని జర్మన్‌లోని ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపాల్సి ఉంటుందన్నాడు. దీన్ని నమ్మిన బిల్డర్, రిటైర్డ్ ఉద్యోగి చెరో రూ. 2 కోట్లు గంగాధర్‌కు ఇచ్చారు. వీరికి మధ్యవర్తిగా ఉంటూ హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ ఉద్యోగిగా చెప్పుకుంటున్న మొయిన్ అనే వ్యక్తి రూ. 50 లక్షలు తీసుకొని మొహం చాటేశాడు. తీరా ఇదంతా ఫేక్ అని, అలాంటి ఖనిజాలు దేశంలో అరుదుగా ఉంటాయని.. దీనికి ప్రభుత్వాల అనుమతి తదితర వ్యవహారా లుంటాయని తెలుసుకొని వారు సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సీఐడీ గంగాధర్‌రెడ్డితో పాటు కోహ్లీని అరెస్టు చేసింది. విదేశాల్లో భారీ డిమాండ్ అంటూ.. 10 కిలోల యురేనియం, ఇరీడియం విదేశీ మార్కెట్లో రూ. 100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు పలుకుతుందని బాధితులను ఈ గ్యాంగ్ నమ్మించింది. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా చూపించినట్లు తెలిసింది. టాలీవుడ్, శాండిల్‌వుడ్‌లోని ప్రముఖ హీరోలు, రాజకీయ నేతలు తమ ద్వారానే రూ. వందల కోట్లు దక్కించుకున్నారని నమ్మబలికింది. ఇందుకు పలువురు శాండిల్‌వుడ్ హీరోలతో దిగిన ఫోటోలను ఆధారాలుగా చూపించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాల్లో పిడుగు పడినపుడు తమ శాస్త్రవేత్తలు యురేనియాన్ని గుర్తించి ప్రముఖులకు సొమ్ము చేశారని చెప్పడంతో బాధితులు నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్నారు. ఒక్కరి నుంచే రూ.10 కోట్లు.. కొద్ది రోజుల క్రితమే విజయవాడకు చెందిన కొందరు.. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉండే రిటైర్డ్ ఉద్యోగి రామారావు (పేరు మార్చాము)ను ఇదేవిధంగా మోసం చేశారు. రెండున్నరేళ్లుగా రామారావును నమ్మించి ఆయన ఆస్తులన్నీ అమ్మిస్తూ ఖనిజ నిక్షే పాల పేరిట దండుకున్నట్టు రామారావు కుమారుడు నగర సీసీఎస్‌లో ఫిరా>్యదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ బృందం.. బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఇరీడియం, యురేనియం దొరుకుతుందని, పలానా చోట దొరికిందని, దాన్ని పరీక్షించేందుకు జర్మన్ శాస్త్రవేత్తలు వస్తున్నారని చెప్పి రూ. కోట్లు దండుకుంటున్నట్లు వెలుగులోకి తీసుకొచ్చింది. రామారావు కేసులో విజయవాడకు చెందిన వ్యక్తిని, హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. వీరి వెనుకున్న గ్యాంగ్ ఏంటి? రెండు రాష్ట్రాల్లో ఎంత మందిని ఇలా మోసగించారో ఆరా తీస్తున్నారు. ఒక్క రామారావే రూ.10 కోట్ల వరకు నష్టపోయినట్లు గుర్తించారు. నమ్మొద్దు: సీఐడీ ఇరీడియం, యురేనియం, ఇతర ఖనిజాల వల్ల రూ. కోట్ల కొద్దీ డబ్బొస్తుందని నమ్మొద్దని, ఇలాంటి ముఠాలకు చెందిన సభ్యుల సమాచారం ఉంటే సీఐడీకి తెలపాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పిడుగు పడినట్లు అలాంటి ఖనిజాలేవి పడవని, అత్యాశకు పోయి ఆస్తులను పోగొట్టుకోవద్దని సూచించారు. -
‘పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో క్రిమినల్ గ్యాంగ్స్’
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్‌లను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రి పరిటాల సునీతను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. టీడీపీ నేతల గూండాగిరికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్న కేసుల్లో సరైన విచారణ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. వారిపై ఆలస్యంగా ఛార్జిషీట్లు నమోదు చేసి శిక్షలు పడకుండా పోలీసులు సహకరిస్తున్నారని కృష్ణప్ప ధ్వజమెత్తారు. చదవండి : పరిటాల అనుచరుల రౌడీరాజ్యం -
కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
-
ఆ వార్తలు నిజం కాదు
సాక్షి, కరీంనగర్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు తిరుగుతున్నాయన్న పుకార్లే అందుకు కారణం. ‘సైకోలు వచ్చారు...పిల్లలను ఎత్తుకుపోతున్నారు, రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ శాఖ స్పందించింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు . అయితే ఇవన్నీ వదంతులని, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినా ప్రజలు ఏ మాత్రం లెక్క చేయకుండా మతిస్థితంలేని, వలస కూలీలను, తెలుగు భాష రాని వారిని పట్టుకుని పలుచోట్ల దాడులు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దొంగల పేరుతో మహిళా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏడుగురిని షీ టీమ్ అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురిపై నిర్భయ కేసు, నలుగురిపై ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేసి జరిమానా విధించామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని, సీపీ కమలాసన్ తెలిపారు. -
చోరుల హల్చల్
నగరంలో చోరులు హల్చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా తాళం వేసి వెళ్లి గంటలోనే తిరిగి వచ్చే లోపే పనికానిచ్చేసి నగర వాసులను బెంబేలెత్తిస్తున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. విశాఖ క్రైం: నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతన్న ఇంటి దొంగతనాలు పోలీసులతో పాటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళాలు తీయకుండా కిటకీలను లక్ష్యంగా చేసుకుని.. వెనుక తలుపులు బద్ధలు గొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగటిపూట పెరిగిన చోరీలు గతంలో అర్ధరాత్రులు, ఒంటిరిగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా దొంగతనాలు జరిగేవి. ప్రస్తుతం దొంగలు పంథా మార్చారు. ఇతర రాష్ట్రాల ముఠాలతో చేతులు కలిపి దోపిడీలు, బెందిరింపులకు గురి చేసి అందినకాడకి దోచుకుపోతున్నారు. పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరి కొంత మంది కొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఈజీగా పని కానిచ్చేస్తున్నారు. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న పోలీస్‌శాఖ పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయలేని దుస్థితిలో వుంది. నగరంలో ఇతర రాష్ట్రాల ముఠాలు బిహార్, ఝార్కండ్, ఒడిశా, గుంటూరు, ప్రకాశం, రాజస్తాన్ కు చెందిన ముఠాలు నగరంలోకి దిగాయి. వీరితో స్థానిక దొంగులు చేతులు కలుపుతున్నారు. నగరంలోని విశాఖ ,విజయనగరం, నెల్లూరు, కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చి ముందుగా తాళాలు వేసిన ఇళ్లును రెక్కీ నిర్వహిస్తారు. వీలు చిక్కినప్పుడు దొంగతనాలకు పాల్పడతారు. నగరానికి చెందిన మామిడి తిరుపతిరావు, రౌతు మల్లేష్, దున్న కృష్ణ, మణికంఠ, జి.పైడిరాజ్, తోట శివభవానీ తదితరులు ఇంటి దొంగతనాలు చేస్తుంటారు. పోలీసులు తిరుగుతున్నా.. ఎంవీపీకాలనీలో బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి, చినవాల్తేరులోని రెండు ఇళ్లలో పట్టపగలే దొంగతనాలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా తిరుగుతున్నా దొంగతనాలు మాత్రం సర్వసాధారణం అయిపోయాయి. చినముషిడివాడలో కూడా ఎంవీపీ కాలనీ తరహాలోనే ఇంట్లో అద్దెకి దిగుతామని చెప్పి దొంగతనం చేయడం తెలిసిందే. సీతమ్మధారలోని గత వారం రోజుల్లో మూడు ఇళ్ల తాళాలు పగలుగొట్టిన సంఘటనలతో స్ధానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దొండపర్తి, ద్వారకానగర్‌లో వరుసుగా ఇంటి దొంగతనాలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి దొంగతనాలే అధికం 2016లో విశాఖలో 30 ఇంటి దొంగతనాలు జరిగాయి. ఇందులో 17 కేసుల్లో నేరస్తులను గుర్తించారు. 2017లో 35 కేసులు నమోదు కాగా , 8 కేసుల్లో మాత్రమే నేరస్తులను పట్టుకున్నారు. 2018 లో పదుల సంఖ్యలో ఇంటి దొంగతనాలు జరిగాయి. భోపాల్ గ్రూప్ (ఎంపీ) మధ్యప్రదేశ్‌కు చెందిన భోపాల్ గ్రూప్‌ది స్నాచింగ్‌లకు అందవేసినచెయ్యి. ఒకేసారి నగరంలోని పలు చోట్ల స్నాచింగ్‌లు చేసి పారిపోతారు. విశాఖలో 2010లో సుమారు ఒకే రోజు 10 చోట్ల చైన్‌స్నాచింగ్‌లు చేశారు.వీరు విడతల వారీ దిగుతారు. చెన్నై గ్యాంగ్ (మద్రాస్) మద్రాస్‌లోని రామపురం గ్యాంగ్ నగరంలోకి వచ్చి కారు డోర్ వద్ద డబ్బులు వేసి పక్కతోవ పట్టిస్తుంటారు. వెంటనే దొంగతనం చేస్తారు. ఈ గ్యాంగ్ ముందుగా బ్యాంకుల నుంచి ఎవరు డబ్బులు డ్రా చేస్తారో చూస్తుంటారు. తర్వాత పక్కగా ప్లాన్ గీసి చోరీకి పాల్పడతారు. ఆటో ముఠాలతో బహుపరాక్ విజయనగరం జిల్లా కొత్తవలసలో 202 కాలనీ గ్యాంగ్. వీరంత ఆటోలో ప్రయాణించి ఒక ముఠాగా ఏర్పాడి ప్రయాణికుల నుంచి బ్యాగు దోచుకుంటారు. మహిళలు, యువకులు బ్యాగ్‌లు తెలియకుండా తస్కరిస్తారు. ఇది చాలా డేంజరస్ ముఠా. అప్రమత్తంగా ఉండాలి నగరంలో జరుగుతున్న ఇంటి దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే సంబంధించిన పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. ఇంటి కిటికీ తులుపులు తీసి ఉంచరాదు. ఊరు వెళ్లిన వారు ఇంటికి తాళాలు వేసి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. బంగారు నగలు బ్యాంకు లాకర్లో ఉంచుకోవాలి.– రామకృష్ణ, క్రైం,ఎస్ఐ, ఫోర్తుటౌన్ -
దొంగలొచ్చారు.. దోచుకెళ్తారు!
♦ రాజధానిలో యూపీ, బీహార్ ముఠాలు ♦ శివారు కాలనీలే లక్ష్యంగా దొంగతనాలు ♦ పక్కాగా రెక్కీ... చాకచక్యంగా తాళాలు ధ్వంసం ♦ అడ్డొస్తే విచక్షణారహితంగా ఎదురు దాడే..! ♦ వరుస దొంగతనాలతో ఆందోళనలో ప్రజలు ♦ నిద్దరోతున్న రాత్రి గస్తీ సాక్షి, అమరావతిబ్యూరో : రాజధానిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. శివారు ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాయి. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. యూపీ, బీహార్‌లకు చెందిన దొంగల ముఠాలు అమరావతిపై ఏడాది కిందటే కన్నేశాయి. కృష్ణా పుష్కరాల సమయంలోనే ఈ ముఠాలు ఇక్కడికి వచ్చాయి. ఇళ్లలో దొంగతనాలతో సరిపెట్టుకోలేదు. జనసమూహం ఉండే ప్రదేశాల్లో బంగారు ఆభరణాలు, లగేజీ బ్యాగుల అపహరణతో హడలెత్తించారు. అప్పట్లో పోలీసులు 30మందిని అరెస్టు చేశారు. కొద్దికాలం వెనక్కి తగ్గిన ఆ ముఠాలు మళ్లీ రెండు నెలలుగా రాజధాని ప్రాంతంలో తమ తడాఖా చూపిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉండటం వల్లే... తాజా పరిణామాలతో అంతర్రాష్ట్ర దొంగల వ్యవహారాలపై విజయవాడ పోలీసులు కూపీ లాగుతున్నారు. తిరుపతి, నెల్లూరులతోపాటు హైదరాబాద్ పోలీసులతో కూడా సంప్రదిస్తూ అక్కడ జరుగుతున్న దొంగతనాల తీరుతో పోల్చి చూస్తున్నారు. హైదరాబాద్ పోలీసులతో సంప్రదించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా కొంతకాలంగా జరుగుతున్న దొంగతనాలకు అమరావతిలో సంఘటనలకు మధ్య సారూప్యత ఉందని గుర్తించారు. యూపీ, బీహార్‌లకు చెందిన దొంగలు తెలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలపైనే కన్నేశారని నిర్ధారించారు. దాదాపు 300 దొంగల కుటుంబాలు కృష్ణా, గుంటూరు జిల్లాలను లక్ష్యంగా చేసుకున్నాయని గుర్తించారు. ఇక్కడ నిర్మాణ కార్యకలాపాలు, ఇతర వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండటమే ఇందుకు కారణమని తేలింది. దీంతోపాటు ఈ నగరాలను ఆనుకుని గ్రామీణ ప్రాంతాలు ఉండటం కూడా తమకు కలసివస్తుందని దొంగల ముఠాలు భావించాయి. దశలవారీగా వస్తూ... యూపీ, బీహార్ల నుంచి దొంగల ముఠాలు దశలవారీగా వచ్చి కొన్ని నెలలపాటు రాజధాని పరిధిలో ఉండి దొంగతనాలతో హల్చల్ చేయాలని నిర్ణయించుకున్నాయి. నిఘా తక్కువగా ఉండే శివారు కాలనీల్లో ఒకటికి రెండుసార్లు రెక్కీ నిర్వహించి పకడ్బందీగా దొంగతనాలను పాల్పడుతున్నాయి ఈ క్రమంలో కొందరు పోలీసులకు చిక్కినప్పటికీ ఇతర ముఠాలు వెనక్కి తగ్గకూడదని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే విచక్షణారహితంగా దాడి చేయడానికి కూడా ఈ ముఠాలు సిద్ధపడి ఉంటాయని పోలీసుల విచారణలో వెల్లడికావడం కలవరపరుస్తోంది. నిద్రమత్తులో నిఘా.. రాజధాని అమరావతి ప్రాంతంలో రాత్రిళ్లు భద్రత లోపభూయిష్టంగా ఉండటం దొంగలకు కలసివస్తోంది. విజయవాడలోగానీ శివారు కాలనీల్లో రాత్రి గస్తీ లేకుండాపోయింది. తగినంత మంది సిబ్బంది, వాహనాలు వంటి మౌలిక వ్యవస్థ లేకపోవడం వల్లే రాత్రి గస్తీ బలహీనపడిందని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. సీసీ కెమెరాల కోసం ఏడాదిన్నరగా అడుతున్నా... ఇప్పటికీ కూడా నిధులు మంజూరు చేయలేదని ఆయన చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో యూపీ, బీహార్ ముఠాలు రాజధానిలో తిష్టవేశాయన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పోలీసులు నిఘాను ముమ్మరం చేసి దొంగల ఆగడాలను ఆరికట్టాల్సిన అవసరం ఉంది. -
చైన్ స్నాచింగ్ ముఠాల గుట్టు రట్టు
* రూ. 16 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం * పోలీసుల అదుపులో ఇద్దరు బాల నిందితులతో సహా ఎనిమిది మంది గుంటూరు (నగరంపాలెం): గుంటూరు నగరంలో వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న రెండు ముఠాలకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు బాల నిందితులున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ అడిషనల్ ఎస్పీ బీపీ తిరుపాల్ వివరాలు వెల్లడించారు. రెండు ముఠాలుగా ఏర్పడిన ఎనిమిది మంది పట్టాభిపురం, కొత్తపేట, అరండల్‌పేట, నల్లపాడు, నగరంపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో మార్చి 3 వ తేదీ నుంచి సెప్టెంబరు 5 వ తేదీ వరకు మొత్తం 12 చైన్ స్నాచింగ్స్, 6 చైన్ స్నాచింగ్ ప్రయత్నాలు చేశారు. ఐపీడీ కాలనీకి చెందిన పసుపులేటి బాలు, దూదేకుల నాసరవలి ఒక ముఠాగా.., నల్లచెరువుకు చెందిన మహంకాళి దుర్గారావు నాయకుడుగా సంపత్‌నగర్‌కి చెందిన టేకి పవన్‌కుమార్, శ్రీనివాసరావుతోటకు చెందిన కుంచాల అంకమ్మరావు, ఆర్ అగ్రహారానికి చెందిన పసుపులేటి దుర్గా శేఖర్, ఇద్దరు బాలనేరస్తులు ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడ్డారు. చైన్ స్నాచింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశేష్టి త్రిపాఠీ పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కేసులను ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీ అధారంగా నిందితులను గుర్తించి మంగళవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో నగరంలో వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఆరుగురు వ్యక్తుల నుంచి 180 గ్రాముల బంగారం చైన్లు, ఇద్దరు వ్యక్తుల నుంచి 186గ్రాముల బంగారం చైన్లు, దోపిడీకి వినియోగించిన ఒక యాక్టివా, రెండు ఎఫ్‌జడ్ , ఒక సీబీజడ్, ఒక కరిజ్మా, ఒక షైన్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.16లక్షలు ఉంటుంది. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే.. నిందితులలో 19 నుంచి 20 సంత్సరాల యువకులు ఆరుగురు, ఇద్దరు బాలనేరస్తులు ఉన్నారు. వీరు ఈజీ మనీ సంపాదించటానికే చైన్‌స్నాచింగ్‌లు చేయటం ప్రారంభించారని తిరుపాల్ తెలిపారు. పసుపులేటి బాలు ఆటోడ్రైవరుగా జీవిస్తూ కర్రబిళ్ళలో,గుర్రపు పందెల్లో బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు పోగొట్టుకొని నాసర్వలితో స్నేహం చేస్తూ తేలికగా డబ్బు సంపాదించటానికి ఈ మార్గం ఎంచుకున్నాడన్నారు. మహంకాళి దుర్గారావు ,పేటి పవన్‌కుమార్ 2015లో చైన్‌స్నాచింగ్ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించి బయటికి వచ్చిన తర్వాత స్థానిక యువకుల సహకారంతో చైన్ స్నాచింగ్‌లు చేయటం ప్రారంభించారన్నారు. నగర ప్రజలు, తల్లిదండ్రులు పనీపాట లేకుండా అధికంగా నగదు ఖర్చు చేస్తున్న యువతపై నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఎ. వెంకటేశ్వరరెడ్డి, ఎమ్. సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫేక్ కాల్ సెంటర్ల ద్వారా ఆన్లైన్ చోరీలు..
ఇన్సూరెన్స్ ఏజెంట్లు, టెలికాలర్ల వద్దనుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే జర జాగ్రత్త! దొంగల ముఠాలు రోజురోజుకూ హైటెక్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. సిమ్ కార్డులనుంచి, బ్యాంకు ఖాతాల దాకా అంతా నకిలీ రాజ్యం ఏర్పాటు చేసుకుంటున్న ముఠాలు... ఇప్పుడు ఏకంగా నకిలీ డాక్యుమెంట్లతో ఫేక్ కాల్ సెంటర్లను, ఆన్ లైన్ బిజినెస్ హౌస్ లనే తెరిచేస్తున్నారు. తాజాగా భారత రాజధాని ఢిల్లీ కేంద్రంగా లెక్కల్లో నేర్పును ప్రదర్శిస్తూ కోట్లను కొల్లగొట్టేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నదొంగల ముఠాలు ఓ ప్రీమియం ధర వద్ద అక్రమ లాజిస్టిక్స్ అందిస్తూ వ్యాపారాన్ని హాయిగా కొనసాగించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు వంద వరకూ నకిలీ కాల్ సెంటర్లు, బిజినెస్ హౌస్ లు భారత దేశం అంతటా వ్యాపించి, ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది. మార్కెటింగ్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని, నకిలీ కంపెనీలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు చేసేందుకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ప్రీమియం కమిషన్ వసూలు చేస్తున్నారని UP STF అదనపు సూపరింటిండెంట్ త్రివేణి సింగ్ చెప్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులతోపాటు, UP STF బృదం స్థానిక కృష్ణానగర్, నోయిడాల్లో ఉన్న రెండు కార్యాలయాలపై దాడులు నిర్వహించి సుమారు వందమందిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ మొత్తం పదకొండు కంపెనీలను నిర్వహిస్తూ.. దేశంలో అనేకమంది ఏజెంట్ల ద్వారా జనానికి వారి ఇన్సూరెన్స్ పాలసీలపై అధిక బోనస్ ఆశ చూపి ఎరవేస్తున్నట్లు తెలిసింది. నకిలీ ఇన్సూరెన్స్ కాల్ సెంటర్లలో వినియోగిస్తున్న సుమారు 50 సిమ్ కార్డులు, ఫేక్ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బిజినెస్ హౌస్ ల ద్వారా కస్టమర్ల డేటాను సేకరించి 35 పైసలు మొదలు, ఐదు రూపాయల వరకూ అమ్మకాలు కూడ జరుపుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అలాగే పోలీసులకు తెలియకుండా ఉండేట్టు నకిలీ గుర్తింపు కార్డులతో ఉన్న సిమ్ లను ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు. ఈ సిమ్ కార్డులను డూప్ కస్టమర్లకు కాల్ చేసేందుకు వినియోగిస్తున్నారని, టెలికాం కంపెనీ ఉద్యోగుల సహాయంతో వారం రోజుల వ్యవధిని తీసుకొని నకిలీ డాక్యుమెంట్లతో ఫోన్ కాల్స్ కూడ అందుబాటులోకి తెస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. అలాగే నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంక్ ఖాతాలను కూడ తెరిపించి 15 శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి ముఠాలు ఎవరికీ అనుమానం రాకుండా అందమైన ఖరీదైన ఇళ్ళలో తమ కార్యాలయాలను స్థాపించి జోరుగా దందా కొనిసాగిస్తున్నారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా కేవలం మూడు నాలుగు నెలల లోపే అక్కడినుంచి దుకాణం ఎత్తేస్తున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా వేలమందిని మోసగించి పదికోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మనీకేర్ వ్యాల్యూ ప్రైవేట్ లిమిటిడె పేరున జనకపురిలో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఈ ముఠా.. కాల్ సెంటర్ ను మాత్రం హరినగర్ లో కొనసాగిస్తున్నారని, ఈ సంస్థలో సుమారు 70 నుంచి 80 మంది ఉద్యోగులు టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. సో ప్రస్తుత తరుణంలో డబ్బు ఎరవేసే ఏజెంట్లకు లొంగిపోకుండా జర జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
దొంగలు దోచేస్తున్నారు..పోలీసులేం చేస్తున్నారు
- జిల్లాలో చెలరేగిపోతున్న దొంగలు - ఓ వైపు ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో పోలీసులు - మరోవైపు దోపిడీ దొంగల స్వైర విహారం కడప అర్బన్: జిల్లాలో రోజురోజుకు దోపిడీ దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగల ముఠా తమ కార్యకలాపాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో కొన్ని ముఠాలు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజల మాన ప్రాణాలతో సైతం చెలగాటమాడేవారు. ప్రస్తుతం పెడదోవ పట్టిన యువత ముఠాలుగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెక్కీలు నిర్వహించి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. కొన్ని సంఘటనల్లో వృద్ధులు, మహిళలు ఇంట్లో ఉన్న సమయంలో వారిని బెదిరించి, దాడిచేసి దోచుకెళుతున్నారు. జిల్లాలో పోలీసులేమో ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లను సైతం అరెస్టు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ మరోవైపు వరుసగా జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాలకు చెందిన దోపిడీ దొంగలు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. వారు భారీ మొత్తంలో దోచుకెళ్లినా పోలీసులు మాత్రం వారిని అరెస్టు చేసి నామమాత్ర ంగా రికవరీ చేసి జైలుకు పంపారనే విమర్శలున్నాయి. తర్వాత మే చివరి వారంలో, జూన్ నెలలో జిల్లాలో తిరిగి దొంగల ముఠా స్వైర విహారం చేసిందనే చెప్పవచ్చు. ఈ దోపిడీ సంఘటనల వివరాలను పరిశీలిస్తే.. - మ్మలమడుగులోని నాగులకట్ట వీధిలో చౌడం పుల్లమ్మ (70) అనే వృద్ధురాలు తన ఇంటిలో ఉండగా పట్టపగలు గతనెల 27వ తేదీన దోపిడీ దొంగలు ఆమె మెడపై కాళ్లతో తొక్కి కత్తితో గాయపరిచి నాలుగు తులాల చైను, ఐదు తులాల గాజులు దోచుకెళ్లారు. - గతనెల 16వ తేదీ తెల్లవారుజామున ఖాజీపేట మండలం తవ్వారిపల్లె గ్రామంలో ఓబుల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి ఇంటిపైభాగాన నిద్రించాడు. ఆయన ఇంటి వెనుక కన్నం వేసి 19 తులాల బంగారు ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. - కడప నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ రోడ్డులోని లక్ష్మిటవర్స్లో ఐదవ అంతస్తులో న్యాయవాది హైమావతి ఇంట్లో లేని సమయంలో పట్టపగలు దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 27 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. - కడప-తిరుపతి బస్సులో గతనెల 9వ తేదీన తిరుపతికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన బంగారు నగల బ్యాగును కాజేశారు. - అలాగే కడప తాలూకా పరిధిలోని బాలాజీనగర్‌లోనూ, టుటౌన్ పరిధిలోని సర్ఖాజీపుర వీధిలోనూ, చింతకొమ్మదిన్నె పరిధిలోని ఓ అధ్యాపకుని ఇంటిలోనూ రాత్రి ఇంటి తాళాలను పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. - చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో సుమన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళ కు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. - గతనెల 21వ తేదీన కడప రైల్వేస్టేషన్లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన కడప నాగరాజుపేటకు చెందిన అఫ్రియాబేగం, నస్రీన్‌భాను అనే మహిళల బ్యాగులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు భారీగా బంగారు ఆభరణాలను కాజేశారు. ఇప్పటికైనా పోలీసుల నిఘా పెంచకపోతే మరిన్ని దోపిడీలు, దొంగతనాలు జరిగే ప్రమాదముంది. -
పోర్టులో అక్రమార్కుల లంగరు
- పెరుగుతున్న చోరీలు - గ్యాంగ్ ఫైల్స్ తెరచినా ఫలితం శూన్యం కాకినాడ క్రైం : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టులో అక్రమార్కులు లంగరు వేశారు. ప్రతి నిత్యం రూ. కోట్ల విలువైన బియ్యం, మొక్కజొన్న, బొగ్గు, గ్రానైట్, వంట నూనె తదితరాలు కాకినాడలోకి యాంకరేజ్, డీప్‌వాటర్ పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. విలువైన రసాయనాలను దిగుమతి చేస్తున్నారు. యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎగుమతికి అనుమతి లభించడంతో బార్జిల ద్వారా బియ్యాన్ని ఓడల్లోకి ఎక్కిస్తున్నారు. ఈ ఎగుమతి దిగుమతుల నేపథ్యంలో కొందరు ముఠాలుగా ఏర్పడి భారీ ఎత్తున చోరీలకు పాల్పడుతున్నారు. సుమారు నెలా పదిరోజుల క్రితం ఏటిమొగకు చెందిన కొందరు బార్జి సిబ్బందిని భయపెట్టి వారి నుంచి బియ్యం బస్తాల చోరీకి పాల్పడగా పోర్టు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుమారు పదిరోజుల కిందట తిమ్మాపురంలో పోలీసులు ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించగా పోర్టు నుంచి చోరీ చేసిన 20 క్వింటాళ్ల బియ్యం దొరికాయి. ఇలా ప్రతి నెలా పోర్టు, తిమ్మాపురం, సర్పవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో పోర్టుకి సంబంధించిన సుమారు 10 చోరీ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. యూరియా, వంటనూనె, ఇతర రసాయనాలను ఏకంగా లారీలతో సహా అపహరిస్తున్నా నిరోధించే నాథులు కరువయ్యారు. కంపెనీల ప్రతినిధుల ప్రమేయంతోనే.. పోర్టులో సుమారు 20 కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఓడల్లో రవాణాకు గాను సరుకును ఏకమొత్తంలో ఇక్కడికి తీసుకువస్తుంటారు. ఇదే అదనుగా కొందరు చోరీలకు పాల్పడతున్నారు. ఈ చోరీలకు కొన్ని సందర్భాల్లో ఆయా కంపెనీల ప్రతినిధుల సహకారం కూడా లభిస్తుండడంతో అక్రమార్కుల పని సులువవుతోంది. గత ఏడాది జీఎస్పీసీలో రూ. 5 కోట్ల విలువైన యంత్ర సామగ్రిని ఎత్తుకుపోయారు. గొడౌన్లో ఉన్న సామగ్రిని దొంగిలించడంలో వారికి సెక్యూరిటీ సిబ్బంది సహకరించారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. కాకినాడ పోర్టులో ఇటువంటి చోరీలకు పాల్పడే ముఠాలు ఎనిమిది ఉన్నాయని భావిస్తున్నారు. కొన్ని ముఠాల సభ్యులు ఇతర జిల్లాల్లో కూడా చోరీలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు. వారిపై ఇప్పటికే గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపిం చడం లేదు. పోర్టులో చోరీల అదుపునకు గతంలో ఏర్పా టైన చెక్‌పోస్టులు ఇప్పుడు సరిగా పనిచేయకపోవడంతో మళ్లీ చోరీలు ఊపందుకున్నాయి. పోర్టు కేంద్రంగా అక్రమార్కులు రూ. కోట్ల విలువైన సరుకు దోచుకుని పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగిస్తున్నారు. -
ఇరు ఊర్ల హిజ్రాలు కొట్టుకున్నారిలా..!
-
అటెన్షన్ డైవర్ట్ గ్యాంగ్‌ల హాల్ చల్