భోపాల్: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించిన వారి పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు, ఇంకెన్నో కార్యక్రమాలు చేపడుతున్నా అవేవి వారిని కాపాడలేకపోతున్నాయనే చెప్పాలి. ఓ వైపు బయట వాళ్ల నుంచి లైంగిక దాడులు, మరో వైపు కుటుంబ సభ్యుల నుంచి ఆచారాలు పేరుతో ఆగడాలు.. ఇలా వాళ్లపై హింసాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటీవల ఓ యువతిని కుటుంబ సభ్యులే చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టగా.. తాజాగా సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే సందేహం కలిగేలా.. బంధువులతో ఫోన్లో మాట్టాడారని నేపంతో కుటుంబ సభ్యులే యువతులపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు వారి బంధువులతో ఫోన్ మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది.
దీంతో కోపంతో ఆ యువతులను ఇంట్లోని వారే దారుణంగా హింసించారు. కాగా వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. యువతులు కొట్టకండి అని కుటుంబ సభ్యులను వేడుకుంటున్నా కనికరం లేకుండా వాళ్లను కర్రలు, రాళ్ళతో కొట్టారు. వారిని హింసించిన వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తాండా పోలీస్ స్టేషన్ అధికారుల ప్రకారం.. ఈ సంఘటన జూన్ 22 న పీపాల్వా గ్రామంలో జరగగా, వీడియో కాస్త జూన్ 25 న పోలీసులకు చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.
I have received another complaint of a woman being brutally beaten up by a mob. If anyone can update me on this case : wrt location and date.
What kind of a barbaric society have we become, the person is laughing while filming this! No fear of the law? Contempt of SC judgments! pic.twitter.com/kl1CNUIs6S— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 4, 2021
Comments
Please login to add a commentAdd a comment