అబద్ధాలు చెప్పి ఓ ప్రబుద్ధుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.
లంగర్‌హౌస్: అబద్ధాలు చెప్పి ఓ ప్రబుద్ధుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. చివరి నిమిషంలో నిజం తెలియడంతో పెళ్లి ఆగిపోయింది. లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్న శ్రీకాంత్(25) గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే వాడు. ప్రస్తుతం ఆటో నడిపిస్తున్నాడు. కంపెనీలో పని చేస్తున్న సమయంలో నిజామాబాద్‌కు చెందిన రజనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి పాప పుట్టింది. అనంతరం రజనిని వేధించి ఆరు నెలల క్రితం ఇంటి నుంచి తరిమేశాడు.
కాగా ఈ విషయాన్ని దాచిపెట్టి లంగర్‌హౌస్‌కు చెందిన సారికను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం ఉదయం రాజేంద్రనగర్ మండలం కాళీమందిర్ వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి వివాహం జరుగుతుంది. ఓ ఆటో డ్రైవర్ అమ్మాయి తరఫున పెళ్లికి వచ్చాడు. శ్రీకాంత్‌ను గుర్తుపట్టి వివాహం జరిగిన విషయం చెప్పడంతో అందరు ఆశ్చర్యపోయారు. అది వివాహం కాదట..ఙఞ్చటకాగా తాను పెళ్లి చేసుకోలేదని, రజనితో మూడు సంవత్సరాలు సహజీవనం చేస్తే తమకు పాప పుట్టిందని, తరువాత పాపతో పాటు ఆమె వెళ్లిపోయిందని బుకాయించాడు. దీంతో వధువు తరఫు బంధువులు అతడ్ని చావబాదారు. పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది.