
సంజయ్ దత్ క్యాన్సర్‌ను జయించారు. ఈ శుభవార్తను ఆయన తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆగస్ట్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నప్పుడు ఊపిరి ఆడకపోవడంతో ఆసుపత్రిలో చేరారాయన. అప్పుడే ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తెలిసింది. కొన్ని రోజులు చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, చికిత్స తీసుకున్నారు సంజయ్ దత్. చికిత్సకు ఆయన శరీరం సరిగ్గా స్పందించడంతో త్వరగా కోలుకున్నారని తెలుస్తోంది. క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయాన్ని తన పిల్లలు షహ్రాన్, ఇక్రా పుట్టినరోజు (బుధవారం) సందర్భంగా ప్రకటించారు సంజయ్ దత్.
ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ – ‘‘గత కొన్ని నెలలు నాకు, మా కుటుంబానికి చాలా కష్టమైన రోజులు. ధైర్యంగా నిలబడగలిగేవాళ్లకే పెద్ద పెద్ద సమస్యలిస్తాడట దేవుడు. ఇందులోనుంచి పోరాడి విజేతగా నిలబడ్డాను. ఇదే మా పిల్లలకు నేను ఇస్తున్న పుట్టినరోజు కానుక. అలాగే నేను క్యాన్సర్ నుంచి బయటపడ్డానంటే కారణం నా కుటుంబం, నా బంధువులు, నా కోసం ప్రార్థించిన అభిమానులు. మీ ప్రేమే నన్ను ఆరోగ్యంగా ఉంచగలిగింది. మీ ప్రేమకు ధన్యవాదాలు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment