
వీళ్లు పోలీసులేనా?
దేశాధ్యక్షుడైన రాష్టపతికి కూడా లేని అధికారాన్ని రాజ్యంగం పోలీసుల చేతిలో పెట్టింది.
ప్రొద్దుటూరు: దేశాధ్యక్షుడైన రాష్టపతికి కూడా లేని అధికారాన్ని రాజ్యంగం పోలీసుల చేతిలో పెట్టింది. తప్పు చేసిన వారిని సన్మార్గంలో పెట్టడానికి లాఠి వాడే అధికారం ఇచ్చింది. కాని మంగళవారం జరిగిన ఈ సంఘటనను చూస్తే పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నార ని అర్ధమవుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన అరవ మునివర(45) అనే వ్యక్తిని బుకీ అనే నెపంతో పట్టుకెళ్లిన పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు.
అతని వీపు, కాళ్లు, పూర్తిగా నల్లగా మారే వరకు హింసించారు. అంతే కాకుండా అతని దగ్గర నుంచి బలవంతంగా పదిలక్షల రూపాయలు వసూలుచేసి వాటిని బెట్టింగ్ ద్వారానే సంపాదించినట్టు కేసు నమోదు చేశారు. బాధితుడు ప్రస్తుతం తనకు న్యాయం చేయాలని మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ వెళ్లాడు.