
కాబూల్: తాలిబన్లు రెచ్చిపోయారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చితకబదారు. రక్తమొచ్చేలా దాడి చేశారు. వారిని దాడి చేసి బంధించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గానిస్తాన్‌లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్-ఈ-చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు ఎత్తుకెళ్లిపోయారు.
చదవండి: లోకేశ్‌కి ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ
అనంతరం ఓ గదిలో బంధించి చితకబాదారు. వారి దుస్తులు విప్పేసి రక్తమొచ్చేలా తీవ్రంగా దాడి చేశారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు తఖి దర్యాబీ, నిమతుల్లా నక్తీ. జర్నలిస్టు వృత్తిని ఎగతాళి చేస్తూ దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తెలిపారు. తమ పాలనలో మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లదని తాలిబన్లు ప్రకటించారు. అయినా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిద్దరితో పాటు మరికొందరు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి అనంతరం విడిచి పెట్టారని చెప్పారు. దర్యాబీ, నక్దీ ఓ ఛానల్‌లో వీడియో ఎడిటర్లుగా పని చేస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్ లోకం ఖండిస్తోంది.
Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl
— Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021
Comments
Please login to add a commentAdd a comment