ముజఫర్ నగర్: తమ ఆకతాయి చేష్టలను అడ్డుకున్నాడని ముగ్గురు వ్యక్తులు కలసి ఓ ట్రావెలింగ్ ఏజెన్సీ యజమానిని కొట్టిపడేశారు.
ముజఫర్ నగర్: తమ ఆకతాయి చేష్టలను అడ్డుకున్నాడని ముగ్గురు వ్యక్తులు కలసి ఓ ట్రావెలింగ్ ఏజెన్సీ యజమానిని కొట్టిపడేశారు. ఓ ట్రావెలింగ్ ఏజెన్సీని నడుపుతున్న హుస్సేన్ అహ్మద్ తన ఏజెన్సీలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై ముగ్గురు యువకులు ఈవ్ టీజింగ్కు పాల్పడటం గమనించాడు. అలాంటి చేష్టలు తప్పని వారిని మందలించి వదిలేశాడు.
కానీ, అతడి మాటలను పెడచెవినపెట్టిన యువకులు హుస్సేన్ ఏజెన్సీ వద్దకు వచ్చి తొలుత రాళ్లు రువ్వారు. అనంతరం అతడిపై అమాంతం దాడి చేసి పిడిగుద్దులు గుప్పించారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి యువకులను అరెస్టు చేశారు.