కై రో: భారత టాప్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌కు వాడి డగ్లా ఓపెన్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ మరియమ్ మెట్‌వాలీ (ఈజిప్ట్) చేతిలో 11-5, 11-9, 6-11, 7-11, 8-11 తేడాతో దీపిక ఓడింది.
తొలి రెండు గేమ్స్ సులువుగానే నెగ్గినా ఆ తర్వాత మాత్రం ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో వరుసగా మూడు గేమ్‌లను కోల్పోరుుంది. ఇక దీపిక ఓటమితో ఈ ఈవెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది.