ఢిల్లీలో ఒక ప్రయవేట్ చానల్ కు చెందిన మహిళా జర్నలిస్టుపై ఇద్దరు వాహనదారులు దాడికి దిగారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒక ప్రయవేట్ చానల్ కు చెందిన మహిళా జర్నలిస్టుపై ఇద్దరు వాహనదారులు దాడికి దిగారు. మయూర్ విహార్ ఏరియాలో బుధవారం ఉదయం ఆ ఘటన జరిగింది. మారుతి ఆల్టో కారులో ఉదయమే ఆఫీసుకు బయలుదేరిన ఆమె, పక్కనే వెళుతున్న స్కార్పియో వాహనాన్ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లింది. దీంతో ఆ వాహనంలో ఇద్దరు వ్యక్తులు మహిళా జర్నలిస్టుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆమె తేరుకునే లోపే దుండగులు అక్కడినుంచి పారిపోయారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతవారంలో తన కారును వెనకనుంచి చిన్నగా తాకిన పాపానికి ద్విచక్రవాహనదారుడ్ని కొట్టిచంపిన సంఘటన ఢిల్లీలో కలకలం రేపింది. కోపోద్రిక్తులైన స్థానికులు వాహనాలకు నిప్పుపెట్టి ఆందోళనకు దిగారు. తన కళ్ళముందే నాన్నను కొట్టి చంపారని... పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని మృతుని కుమారుడు వాపోయిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ,ఆప్ మధ్య కూడా వివాదం రగిలింది. ఈ వివాదం ఇంకా చల్లారకముందే మరో సంఘటన జరగడం సంచలనం సృష్టించింది.