
భువనేశ్వర్: భూవివాదం పరిష్కరించండంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. న్యాయం చేయాల్సిన ఎస్సై కాస్తా.. సదరు యువకుడిపై అమానుషకర రీతిలో దాడి చేసిన సంఘటన సంచలనం రేపింది. వివరాలు.. తరలసరువా గ్రామానికి చెందిన రాజు మహంత్ అనే యువకుడు భూతగదా పరిష్కారం కోసం కియోంజార్ జిల్లాలోని పటనా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే న్యాయం చేయాల్సిన ఎస్సై సంధ్యరాణి జెన సదరు యువకుడిపై దాడి చేసింది. దారుణంగా కొట్టి హింసించింది. ఇంత జరుగుతుంటే పోలీసు స్టేషన్‌లోని మిగితా సిబ్బంది సైలెంట్‌గా చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు అడ్డు చెప్పలేదు. సంధ్య రాణి యువకుడిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నత అధికారులు ఈ ఘటనపై స్పందించారు. సదరు అధికారిణిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు..