
సింధుకు షాక్
డెన్మార్క్ ఓపెన్ రెండో రౌండ్‌లో ఓటమి
ఒడెన్‌స: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, హైదరాబాదీ స్టార్ పి.వి.సింధు రెండో రౌండ్‌లో కంగుతింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆరో సీడ్ సింధుకు అన్‌సీడెడ్ జపాన్ క్రీడాకారిణి సయాక సాటో షాకిచ్చింది. భారత స్టార్ 13-21, 23-21, 18-21తో సయాక చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో సయాక జోరుతో సింధు తేరుకోలేకపోరుుంది. రెండో గేమ్‌లోనూ ఒక దశలో వెనకబడ్డ సింధు... చివర్లో పుంజుకుని ఆశలు నిలుపుకుంది.
అరుుతే మూడో గేమ్‌లో 18-18తో స్కోరు సమంగా ఉన్న దశలో సయాక అద్భుతంగా ఆడి వరుసగా మూడు పారుుంట్లతో సింధుకు షాక్ ఇచ్చింది. పురుషుల ఈవెంట్‌లోనూ భారత క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. అజయ్ జయరామ్‌తో పాటు హెచ్.ఎస్.ప్రణయ్ టోర్నీ నుంచి నిష్ర్కమించారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 21-23, 15-21తో యుకిషి (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రణయ్ 10-21, 20-22తో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో కంగుతిన్నాడు.