ప్రేమికుడు, స్నేహితులు కలిసి చంపారు | Girl Beaten To Death in Gurugram | Sakshi
Sakshi News home page

ప్రేమికుడు, స్నేహితులు కలిసి చంపారు

Published Fri, Jun 10 2016 3:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

ప్రేమికుడు, స్నేహితులు కలిసి చంపారు

ప్రేమికుడు, స్నేహితులు కలిసి చంపారు

గురుగ్రామ్ : కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఒక అమ్మాయిని చంపిన దారుణ ఘటన యూపీలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. చనిపోయిన అమ్మాయి ప్రత్యర్ధులతో తలపడినట్లు వివరించారు. ఐరన్ రాడ్‌తో ప్రత్యర్ధులు గాయపర్చడంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం అమ్మాయి బాయ్ ఫ్రెండుతో గొడవపడిందని, గురువారం తెల్లవారుజామున ఆ గొడవ పెద్దది కావడంతో అబ్బాయితో పాటు అతని స్నేహితులు కలిసి ఆమెను చంపినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిపై హత్య, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement