పట్టుబడిన రమేష్
♦ స్పెషల్ పార్టీ పోలీసునంటూ యువకుడి హల్‌చెల్
♦ వ్యాపారులను బెదిరించిన వైనం
♦ నకిలీ ఖాకీని గుర్తించి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
♦ కురవి పోలీసులకు అప్పగింత
కురవి(డోర్నకల్): సినీఫక్కీలో వ్యాపారులను మోసగిం చి డబ్బు గుంజాలని చూసిన ఓ నకిలీ పోలీసును ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. చిన్నచిన్న కిరాణం దుకాణా లు.. పాన్‌షాపులు.. గ్రామాల్లోని దుకాణాల వద్దకు వెళ్లి స్పెషల్ పార్టీ పోలీసునంటూ బెదిరింపులకు పాల్ప డుతూ.. డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడి బండారం బయటపడింది. స్పెషల్ పార్టీ పోలీస్‌నంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి శుక్రవారం మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో యువకులకు పట్టుపట్టాడు. గ్రామస్తుల క£ý నం ప్రకారం.. కురవి మండలం కొత్తూరు (జీ) శివారు పిల్లిగుండ్ల తండాకు చెందిన బానోతు రమేష్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ చుట్టు పక్కల గ్రామాల్లో స్పెషల్ పార్టీ పోలీసునంటూ కొద్ది రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
కొంతకాలంగా ఇదే తంతు..
బానోతు రమేష్ మండలంలోని గుట్కాలు, అంబర్‌ప్యాకె ట్లు అమ్మే షాపుల వద్దకు వెళ్తుంటాడు. షాపుల్లోకి వెళ్లి గు ట్కా ఉందా..? అంబర్‌ప్యాకెట్ ఉందా? అని అడగడం, వారు ఇచ్చేసరికి నేను స్పెషల్ పార్టీ పోలీసునని, అక్రమ దందా చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చిన్న చిన్న షాపుల యజమానులు కేసులకు బయపడి ఈ నకిలీ పోలీస్‌కు ఆమ్యామ్యాలు ఇచ్చుకోవడం చేస్తున్నారు. ఇదే అలవాటుగా మార్చుకున్న రమేష్ రోజుకో ఊరికి వెళ్లి దందా చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మొగిలిచర్లలో తిరుగుతున్నాడు.
అయితే కొన్ని రోజుల క్రితం మొగిలిచర్ల గ్రామంలో ఓషాపు యజమానిని బెదిరించిన విషయం తెలిసిన యువకులు, ద్విచక్రవాహనంపై మొగిలిచర్లలో సంచరి స్తున్న రమేష్‌ను గుర్తించారు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ద్విచక్రవాహన తాళాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ ‘‘ఎవడ్రా నాబండి తాళం తీస్తారా? నేను ఎవరినో తెలుసా..? స్పెషల్ పార్టీ పోలీసుని..’’ అని గట్టిగా అరిచాడు. దీంతో యువకులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం మొగిలిచర్ల మార్గంలో వెళ్తున్న కురవి ఎస్సై తీగల రమేష్‌కు పోలీస్‌నంటూ బెదిరింపులకు పాల్పడుతున్న రమేష్‌ను అప్పగించారు. నకిలీ పోలీస్ అవతారం ఎత్తిన రమేష్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు.
విచారణ చేపడుతాం..
స్పెషల్ పార్టీ పోలీసునని దుకాణాదారుల నుంచి నగదు వసూలు చేస్తున్న రమేష్ విషచమై కురవి ఎస్సై తీగల అశోక్‌ను వివరణ కోరగా.. ఆయన మాట్లాడారు. రమేష్ అనే యువకుడిని గ్రామస్తులు అప్పగించారని, విచారణ చేసి ఆయనపై కేసు నమోదు చేస్తామని వివరించారు.