Fake policeman
-
పోలీసునంటూ షాపులో దౌర్జన్యం
సాక్షి, గుంటూరు: సెల్ టెంపర్ గ్లాసు వేయించుకుని, డబ్బులు అడిగిన షాపు యజమానిని ‘నేను పోలీస్’ అంటూ కొట్టి షాపులోని కొన్ని సామాన్లు ఎత్తుకుపోయిన ఓ వ్యక్తిపె బాధితుడు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పంగడిగుంటలో నివసించే వెనిగళ్ల కిరణ్ మహిళా కళాశాల రోడ్డులో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మహ్మద్ అబ్దుల్ సిరాజ్ అనే వ్యక్తి షాపునకు వచ్చి సెల్ ఫోన్ పై టెంపర్ గ్లాసు వేయమన్నాడు. గ్లాసు సెల్‌ఫోన్‌కు బిగించుకున్న అనంతరం డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నాడు. కిరణ్ అతనిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు అబ్దుల్ సిరాజ్ తాను కానిస్టేబుల్‌ను అని చెప్పి డబ్బులు ఇవ్వనన్నాడు. కిరణ్ అదేమిటని ప్రశ్నించడంతో ఇరువురికి గొడవ జరిగింది. కిరణ్‌పై అబ్దుల్ సిరాజ్ చేయిచేసుకుని షాపులోని సెల్ సామగ్రి కొన్నింటిని తీసి తన బండిలో పెట్టుకుని వాహనం నడుపుకుంటూ వెళ్లి పోయాడు. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న కిరణ్ వెళ్లిపోతున్న అబ్దుల్ సిరాజ్‌ను వెనుక నుంచి సెల్‌ఫోన్‌తో ఫొటో తీశాడు. దీనిపై కిరణ్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిరాజ్ బాగా మద్యం తాగి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ప్రియురాలి కోసం పోలీసు అవతారం..
మారేడుపల్లి : బీటెక్ చదివాడు.. అది పూర్తి చేయలేకపోయాడు.. నగరంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరాడు.. స్వగ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు.. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు.. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు.. తనకు డీఎస్పీగా ఉద్యోగం వచ్చిందని ప్రియురాలికి చెప్పాడు.. యూనిఫాం వేసుకొని ఫొటోలు తీసి పంపాడు.. నిజమేనని అమ్మాయితోపాటు ఆమె తల్లిదండ్రులు నమ్మారు.. అంతేకాదు సొంత తల్లిదండ్రులను కూడా నమ్మించాడు..చివరకు విషయం బయటపడటంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి ఆదివారం మారేడ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎం.వి.రవిచంద్ర (29) మూడు సంవత్సరాలుగా వెస్ట్ మారేడుపల్లిలోని సామ్రాట్‌కాలనీ రేఖా రెసిడెన్సీలో నివాసముంటున్నాడు. స్థానికంగా కాలనీవాసులకు, ఇంటి పరిసర ప్రాంతాల వారికి తాను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నానని నమ్మబలికాడు. 2012లో రిక్రూట్మెంట్ బ్యాచ్‌కు చెందిన వాడినని పలువురికి చెప్పుకున్నాడు. పోలీసు యూనిఫాంతో పాటు ఐడీ కార్డు, నేమ్ ప్లేటులతో ఏసీపీగా చలామణి అవుతున్నాడు. తరచుగా యూనిఫాంలో తిరుగుతూ స్థానికులను నమ్మించాడు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రవిచంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ విషయం బయటపడింది. నిందితుడిపై 2015లో నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులు ఎం.వి.రవిచంద్రను అరెస్టుచేశారు. పోలీసు అధికారిగా చెప్పుకుంటూ పలువురిని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.గతంలో జైలుకు వెళ్ళివచ్చినా నిందితుడిలో మార్పు రాలేదు. మరొకసారి టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు. నిందితుడి వద్ద నుండి ఐడి కార్డు, పోలీస్ యూనిఫాం, నేమ్ ప్లేట్, మెడికల్ సర్టిఫికెట్, గ్రీన్ ఇంక్ పెన్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీన పర్చుకున్నారు. రవిచంద్ర స్నేహితులనే తన ఉన్నతాధికారులుగా పలువురికి పరిచయం చేశాడు. రవిచంద్రవల్ల మోసపోయిన వారెవరైనా ఉంటే మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీఐ శ్రీనివాసులు కోరారు. -
నేనెవరో తెలుసా..?
♦ స్పెషల్ పార్టీ పోలీసునంటూ యువకుడి హల్చెల్ ♦ వ్యాపారులను బెదిరించిన వైనం ♦ నకిలీ ఖాకీని గుర్తించి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు ♦ కురవి పోలీసులకు అప్పగింత కురవి(డోర్నకల్): సినీఫక్కీలో వ్యాపారులను మోసగిం చి డబ్బు గుంజాలని చూసిన ఓ నకిలీ పోలీసును ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. చిన్నచిన్న కిరాణం దుకాణా లు.. పాన్‌షాపులు.. గ్రామాల్లోని దుకాణాల వద్దకు వెళ్లి స్పెషల్ పార్టీ పోలీసునంటూ బెదిరింపులకు పాల్ప డుతూ.. డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడి బండారం బయటపడింది. స్పెషల్ పార్టీ పోలీస్‌నంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి శుక్రవారం మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో యువకులకు పట్టుపట్టాడు. గ్రామస్తుల క£ý నం ప్రకారం.. కురవి మండలం కొత్తూరు (జీ) శివారు పిల్లిగుండ్ల తండాకు చెందిన బానోతు రమేష్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ చుట్టు పక్కల గ్రామాల్లో స్పెషల్ పార్టీ పోలీసునంటూ కొద్ది రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కొంతకాలంగా ఇదే తంతు.. బానోతు రమేష్ మండలంలోని గుట్కాలు, అంబర్ప్యాకె ట్లు అమ్మే షాపుల వద్దకు వెళ్తుంటాడు. షాపుల్లోకి వెళ్లి గు ట్కా ఉందా..? అంబర్ప్యాకెట్ ఉందా? అని అడగడం, వారు ఇచ్చేసరికి నేను స్పెషల్ పార్టీ పోలీసునని, అక్రమ దందా చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చిన్న చిన్న షాపుల యజమానులు కేసులకు బయపడి ఈ నకిలీ పోలీస్‌కు ఆమ్యామ్యాలు ఇచ్చుకోవడం చేస్తున్నారు. ఇదే అలవాటుగా మార్చుకున్న రమేష్ రోజుకో ఊరికి వెళ్లి దందా చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మొగిలిచర్లలో తిరుగుతున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం మొగిలిచర్ల గ్రామంలో ఓషాపు యజమానిని బెదిరించిన విషయం తెలిసిన యువకులు, ద్విచక్రవాహనంపై మొగిలిచర్లలో సంచరి స్తున్న రమేష్‌ను గుర్తించారు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ద్విచక్రవాహన తాళాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ ‘‘ఎవడ్రా నాబండి తాళం తీస్తారా? నేను ఎవరినో తెలుసా..? స్పెషల్ పార్టీ పోలీసుని..’’ అని గట్టిగా అరిచాడు. దీంతో యువకులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం మొగిలిచర్ల మార్గంలో వెళ్తున్న కురవి ఎస్సై తీగల రమేష్‌కు పోలీస్‌నంటూ బెదిరింపులకు పాల్పడుతున్న రమేష్‌ను అప్పగించారు. నకిలీ పోలీస్ అవతారం ఎత్తిన రమేష్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ చేపడుతాం.. స్పెషల్ పార్టీ పోలీసునని దుకాణాదారుల నుంచి నగదు వసూలు చేస్తున్న రమేష్ విషచమై కురవి ఎస్సై తీగల అశోక్‌ను వివరణ కోరగా.. ఆయన మాట్లాడారు. రమేష్ అనే యువకుడిని గ్రామస్తులు అప్పగించారని, విచారణ చేసి ఆయనపై కేసు నమోదు చేస్తామని వివరించారు.