టైటిల్‌ పోరుకు ఖాలిద్, ముజఫర్‌ | khalid,muzafar ready to title fight | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు ఖాలిద్, ముజఫర్‌

Published Thu, May 25 2017 10:29 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

khalid,muzafar ready to title fight

హైదరాబాద్‌ ఓపెన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌


సాక్షి, హైదరాబాద్‌: ‘శ్రీ కృష్ణ కేసరి టైటిల్‌’ హైదరాబాద్‌ ఓపెన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఖాలిద్‌ బిన్, మొహమ్మద్‌ ముజఫర్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. యాదవ్‌ అహీ ర్‌ స్పోర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీ 86–120 కేజీల విభాగంలో వీరిద్దరూ ఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన సెమీఫైనల్‌ బౌట్‌లో సయ్యద్‌ మొహమ్మద్‌పై ఖాలిద్, లవకుమార్‌పై ముజఫర్‌ గెలుపొందారు.

86 కేజీల విభాగంలో శ్రీనాథ్‌పై జునైద్, మోహన్‌ గాంధీపై అమర్‌ మోరే నెగ్గి ఫైనల్‌కు చేరుకున్నారు. 74 కేజీల కేటగిరీ సెమీఫైనల్‌ బౌట్‌లో అబ్దుల్‌ సమద్‌పై రామచందర్, అబూబకర్‌ అబ్దుల్లాపై అహ్మద్‌ గెలిచారు.


ఇతర కేటగిరీల సెమీఫైనల్స్‌ ఫలితాలు

70 కేజీలు: మహేశ్‌ యాదవ్‌పై టి. శివ సింగ్, మొహమ్మద్‌ సఫీయుద్దీన్‌పై ఆకాశ్‌ నెగ్గారు. 65 కేజీలు: అబ్దుల్‌ కలామ్‌పై సంతోష్‌; సయ్యద్‌ అబ్రార్‌పై దినేశ్‌ గెలిచారు. 57 కేజీలు: సాయి యాదవ్‌పై అక్షత్‌; విక్రమ్‌పై సంజయ్‌ గెలుపొం దారు. 50 కేజీలు: అస్లామ్‌పై టీకారామ్‌ సింగ్, శ్రీకాంత్‌ ముదిరాజ్‌పై కిషన్‌ సింగ్‌ నెగ్గారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement