
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జోసెఫ్ కుటుంబసభ్యులు దృవీకరించారు. 1985లో ఈరన్ సంధ్య సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెటఇన జోసెఫ్ మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో పనిచేశారు. జెసెఫ్ అందించిన కథలతో సినిమాలు రికార్డు స్థాయి విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
`మను అంకుల్ ' సినిమాతో బెస్ట్ స్క్రిప్ట్ రైటర్‌గా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆయన కెరియర్‌లో ఇప్పటివరకు సుమారు 45 చిత్రాలకు కథలందించారు. అదే విధంగా ఐదు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. జోసెఫ్ మృతితో మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి లోనైంది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని మమ్ముట్టి, మోహన్‌లాల్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
చదవండి : కరోనా రక్కసికి బలైన టీఎన్‌ఆర్
Comments
Please login to add a commentAdd a comment