ఆమె పచ్చి అబద్ధాలు చెప్తోంది! | Kavya Madhavan is lying, she knows me very well, says Pulsar Suni | Sakshi
Sakshi News home page

ఆమె పచ్చి అబద్ధాలు చెప్తోంది!

Published Wed, Aug 23 2017 11:16 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

ఆమె పచ్చి అబద్ధాలు చెప్తోంది!

ఆమె పచ్చి అబద్ధాలు చెప్తోంది!

కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరో నటి కావ్యా మాధవన్‌ మెడకు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్‌ సునీ తాజాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో లైంగికంగా వేధించి.. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలిపాడు. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్‌ సునీ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఈ 'మేడం' ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 'మేడం' అని మాత్రమే చెప్పిన పల్సర్‌ సునీ.. ఆమె పేరు, వివరాలు మాత్రం పోలీసులకు తెలియజేయలేదని తెలుస్తోంది.

ప్రముఖ మాలయళ హీరో దిలీప్‌ రెండో భార్య కావ్యా మాధవనే ఈ 'మేడం' అయి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పల్సర్‌ సునీ ఎవడో తనకు తెలియదని కావ్యా మాధవన్‌ అంటుండగా.. ఆమె వ్యాఖ్యలను పల్సన్‌ సునీ తోసిపుచ్చాడు. 'కావ్యా నేనెవరో తెలియదనడం మూర్ఖత్వం. ఆమెకు నేను బాగా తెలుసు' అని పల్సర్‌ సునీ మీడియాతో తెలిపాడు. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్‌.. పల్సర్‌ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్‌ సూత్రధారి కాగా, ఆయన భార్య కావ్య కూడా పాత్రధారిగా వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement