Kerala actress abduction
-
నటి వేధింపుల కేసు: 'మేడం' ఆమెనే
సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా కీలక విషయాలు వెల్లడించాడు. 'నా మేడం ఎవరో కాదు కావ్యామాధవనే' అంటూ వెల్లడించాడు. అయితే, నటిపై లైంగిక వేధింపుల కేసు వెనుక ఆమె ప్రమేయం ఉందా? అన్న ప్రశ్నకు అతను 'లేదు' అని సమాధానం చెప్పాడు. నటిపై లైంగిక వేధింపుల కేసులో కావ్యా మాధవన్ ప్రమేయం కూడా ఉన్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో అపహరించి.. లైంగికంగా వేధించామని, ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశామని పల్సర్ సునీ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని అతను చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ గతంలో పోలీసులకు చెప్పాడు. తాజాగా ఆ మేడం ఎవరో వెల్లడించిన పల్సర్ సునీ.. అయితే, ఆమెకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని చెప్తుండటం గమనార్హం. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య అయిన కావ్యా మాధవన్‌కు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన రెండో భార్య కావ్య పాత్రపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో రెండోసారి అభ్యర్థించినా నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. -
ఆమె పచ్చి అబద్ధాలు చెప్తోంది!
కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరో నటి కావ్యా మాధవన్ మెడకు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో లైంగికంగా వేధించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలిపాడు. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఈ 'మేడం' ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 'మేడం' అని మాత్రమే చెప్పిన పల్సర్ సునీ.. ఆమె పేరు, వివరాలు మాత్రం పోలీసులకు తెలియజేయలేదని తెలుస్తోంది. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య కావ్యా మాధవనే ఈ 'మేడం' అయి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పల్సర్ సునీ ఎవడో తనకు తెలియదని కావ్యా మాధవన్ అంటుండగా.. ఆమె వ్యాఖ్యలను పల్సన్ సునీ తోసిపుచ్చాడు. 'కావ్యా నేనెవరో తెలియదనడం మూర్ఖత్వం. ఆమెకు నేను బాగా తెలుసు' అని పల్సర్ సునీ మీడియాతో తెలిపాడు. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్ సూత్రధారి కాగా, ఆయన భార్య కావ్య కూడా పాత్రధారిగా వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నటిపై వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్
కొచ్చి: కేరళ నటి అపహరణ, వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను విచారించిన పోలీసులు తాజాగా ఆయన భార్య, నటి కావ్య మాధవన్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటలకు మొదలైన సోదాలు అర్థరాత్రి 2 గంటలకు కొనసాగినట్టు తెలుస్తోంది. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పేమెంట్స్ గురించి పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. అయితే సోదాలపై పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ నేరం చేసిన తర్వాత రెండుసార్లు కావ్య మాధవన్ కార్యాలయానికి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు నటిపై అఘాయిత్యానికి పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోలు ఉన్న మెమరీ కార్డును కూడా కార్యాలయంలోనే దాచిపెట్టివుంటాడని అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఇక్కడ సోదాలు జరిపారు. 2016లో దిలీప్, కావ్య పెళ్లి చేసుకున్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన తర్వాత తన మొదటి భార్య మంజు వారియర్‌కు 2015లో దిలీప్ విడాకులు ఇచ్చారు. వ్యాపారవేత్త నిశాల్ చంద్రను 2009లో పెళ్లి చేసుకున్న కావ్య 2010లో ఆయన నుంచి విడిపోయారు.