ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నే జరుగుతాయి. సినీతారలు కూడా తము నటించే ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని తాపత్రయపడతారు. కానీ అన్నీ హిట్లు కావు, కొన్నే విజయాన్ని అందుకుంటాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా అనుకున్నంత ఆడకపోతే ఆ బాధ వర్ణణాతీతం. తనకూ ఇలాంటి పరిస్థితి ఎదురైందంటున్నాడు హీరో మాధవన్.
రెండున్నర దశాబ్దాలకు రీరిలీజ్
గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మాధవన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఐకానిక్ మూవీ 'రెహనా హై తేరే దిల్ మే' జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఈ మూవీ రిలీజై 25 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టులో రీరిలీజ్ చేశారు.
మనోవేదనకు లోనయ్యా..
సినిమా సంగతులను గుర్తు చేసుకుంటూ.. సినిమా రిలీజవగానే పెద్ద స్పందన లభించలేదు. ఫ్లాప్ అవడంతో నా మనసు ముక్కలైంది. ఈ చిత్ర విజయం కోసం నేను మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుడిమెట్లు లేవు. అయినా కూడా సక్సెస్ కావడంతో మనోవేదనకు లోనయ్యా.. తలరాతలో రాసిపెట్టుండాలని, అలాగే అదృష్టం కూడా కలిసిరావాలని తెలుసుకున్నాను.
రెహనా హై తేరీ దిల్ మే మూవీ విశేషాలు
పాతికేళ్ల తర్వాత అదే మూవీ మళ్లీ రిలీజవడం, అప్పటికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం మాత్రం ఎంతో సంతోషాన్నిచ్చింది అన్నాడు. రెహనా హై తేరీ దిల్ మే మూవీ 2001లో విడుదలైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన మిన్నాలే అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంతోనే హీరో మాధవన్, హీరోయిన్ దియా మీర్జా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment