
నిప్పు లేనిదే పొగ రాదంటారు. కానీ, మా మ«ధ్య ఏ నిప్పు లేకపోయినా కొందరు గాసిప్‌రాయుళ్లు పొగపెడుతున్నారని మండిపడుతున్నారు బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్. ఇంతకీ మేటర్‌ఏంటంటే... సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానీయా... ఇలా ఈ నలుగురు బాలీవుడ్ బ్యూటీలు ‘వీరే ది వెడ్డింగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ‘క్విక్ గన్‌మురుగన్’, ‘ముంబై కట్టింగ్’ వంటి సినిమాలను రూపొందించిన శశాంక్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు. సోనమ్ కపూర్ సోదరి రియా, ఏక్తా కపూర్ నిర్మాతలు. ఇలా ఆల్మోస్ట్ కంప్లీట్‌లేడీస్ గ్యాంగ్ అంతా కలిసి ఈ సినిమా చేస్తుండటంతో బాలీవుడ్ స్టార్స్ అందరి కళ్లూ సినిమాపై ఉన్నాయి. ఈ సినిమా రీసెంట్‌గా ఢిల్లీలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.
ఈ షెడ్యూల్‌లో కరీనా కపూర్, సోనమ్‌కపూర్ ఎడ మొహం పెడమొహంగా ఉన్నారని టాక్. నలుగురు నాయికలు మాటా మాటా అనుకుంటున్నారని కథనాలు అల్లారు కొందరు గాసిప్‌రాయుళ్లు. ఈ కథనాలపై సోనమ్‌కపూర్ షూటుగా స్పందించారు. ‘‘సెట్‌లో మా మధ్య గొడవలు జరుగుతున్నాయని వెబ్ మీడియా వారు బ్లైండ్‌గా ఐటమ్స్ రాస్తున్నారు. వాటి వల్లవారికి క్లిక్స్ వస్తాయేమో. కానీ, అవి నిజాలు కావు. అనవసరంగా మా మధ్య పొగపెట్టొద్దు. మేం హ్యాపీగా షూటింగ్ చేస్తున్నాం. ఇలాంటి గాసిప్స్ వల్ల ప్యూచర్‌లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కలిసి సినిమాలు చేయడం∙మానుకుంటారు’’ అని సోనమ్ పేర్కొన్నారు.