నయా ట్రిక్స్ | Nayantara's Love Relationship With Young Director Vignesh | Sakshi
Sakshi News home page

నయా ట్రిక్స్

Published Tue, Jun 16 2015 4:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

నయా ట్రిక్స్

నయా ట్రిక్స్

ఏ నటికైనా, నటుడికైనా ప్రచారం చాలా అవసరం. అందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అవలంభిస్తుంటారు. కొందరు ధనాన్ని వెచ్చిస్తే, మరి కొందరు సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇంకొందరు యుక్తిని ఉపయోగిస్తుంటారు. నటి నయనతార ఈ మూడో కోవకి చెందినామె అని చెప్పవచ్చు. బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు ఎలాంటి గాసిప్స్‌కు చింతించరు. పైగా అలాంటి వాటిని వారు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే తమపై వదంతుల్ని వారే పుట్టించుకుంటారని కూడా ప్రచారంలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు.
 
 ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రచారంతో మీడియాలో హెడ్‌లైన్స్‌లో ఉండాలన్నదే అలాంటి వారి ఆలోచన. ఇప్పుడీ వరుసలో నటి నయనతార చేరారని చెప్పక తప్పదు. దక్షిణాదిలో ఏ నటి ఎదుర్కోని సమస్యలు ఈమెను చుట్టిముట్టాయి. వీటిలో స్వయంకృతాపరాధం వల్లే అధికం అనక తప్పదు. ముఖ్యంగా ప్రేమలో రెండుసార్లు ఓడిపోయారు. మూడోసారి ప్రేమ ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్ శివతో నయనతార ప్రేమాయణం సాగిస్తున్నారన్నది కోలీవుడ్ టక్. ఇలాంటి వదంతులు హోరెత్తుతున్నా ఏమాత్రం చలించని నయనతార దర్శకుడు విఘ్నేశ్‌శివతో సన్నిహితంగా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్స్‌లో హల్‌చల్ చేస్తోంది.
 
 వీరి మధ్య ఏదో ఉందనే సందేహం పరిశ్రమ వర్గాల్లో కలగడం సహజం. వీటిలో దేనికి నయనతార స్పందించక పోవడం చూస్తుంటే ఇలాంటి వదంతులను ఆమే ప్రచారం చేసుకుంటున్నారనిపిస్తోందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. పలు భేటీలతో వచ్చే ప్రచారం కంటే ఇలాంటి వదంతులతో పది రెట్లు అధికంగా పోందవచ్చుననేది నయనతార యుక్తి కావచ్చునన్నది సినీ వర్గాల భావన. కేరళాకు చెందిన ఈ అమ్మడు కొచ్చిలో నివసిస్తూ షూటింగ్‌లకు చెన్నై, హైదరాబాద్ తదితర ఇతర ప్రాంతాలకు వచ్చిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు చెన్నై, కోయంబేడులో బ్రహ్మాండమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని తెలిసింది. నయనతార భవిష్యత్‌లో చెన్నైలో సెటిల్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement