
ఆమె గాసిప్స్ పట్టించుకోదు
గాసిప్స్ పట్టించుకోకుండా నటనపైనే ఏకాగ్రత పెడతారు నటి నయనతార. ఈ మాటలన్నది ఎవరో కాదు ఆమె తాజా ప్రియుడిగా ప్రచారంలో
గాసిప్స్ పట్టించుకోకుండా నటనపైనే ఏకాగ్రత పెడతారు నటి నయనతార. ఈ మాటలన్నది ఎవరో కాదు ఆమె తాజా ప్రియుడిగా ప్రచారంలో నానుతున్న దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం నానుమ్ రౌడీదాన్. విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు నయనతారకు మధ్య ప్రేమ మొదలైందని, దర్శకుడికి నయనతార ఖరీదైన కారును, ఒక ఇంటిని కొని ఇచ్చారని రకరకాల వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై దర్శకుడు చాలా కాలం తరువాత పెదవి విప్పారు.
ఆయన తెలుపుతూ నానుమ్ రౌడీదాన్ చిత్ర కథను సంగీత దర్శకుడు అనిరుద్ కోసం తయారు చేసినట్లు చెప్పారు. ఆయన కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించి ఆ తరువాత వైదొలిగారని తెలిపారు. దీంతో కథలో కొన్ని మార్పులు చేసి విజయ్‌సేతుపతి హీరోగా నయనతార హీరోయిన్‌గా రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర సమయంలో తనను నయనతారను కలుపుతూ రకరకాల వదంతులను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నయనతారతో ప్రేమతో పాటు తనను మలయాళీని చేసేశారనీ, తాను నిజానికి తాను తమిళుడినని తెలిపారు.
ఇలాంటి అసత్య ప్రచారాలు ఆ వ్యక్తుల మనసుల్ని బాధిస్తాయన్న విషయాన్ని మరచిపోతున్నారని అన్నారు. ఇలా వ్యక్తిగత విషయాలను చెబితే ప్రచారం కోసం పాకులాడుతున్నారంటారన్నారు. నయనతార విషయానికొస్తే ఇలాంటి వదంతులను తను పట్టించుకోరని తన దృష్టినంతా నటన పైనే సారించే నటి అని అన్నారు. ఆమెలా నటనలో మమేకమయ్యే నటిని చూడలేదని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నయనతార మూగ యువతిగా నటిస్తున్నాని ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి ఎవరూ మాట్లాడుకోరని దర్శకుడు వాపోయారు. అదే విధంగా నటుడు పార్తిబన్ విలనీయం ప్రదర్శించడం విశేషం అని అన్నారు