తొలి సినిమా రిలీజ్ కాలేదు.. జాన్వీకి తెలుగులో మూడో ఛాన్స్? | Janhvi Kapoor In Talks For Nani And Srikanth Odela New Movie | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: తెలుగులో మరో స్టార్ హీరో సినిమాలో జాన్వీ?

Published Tue, Jul 16 2024 1:39 PM | Last Updated on Tue, Jul 16 2024 2:54 PM

Janhvi Kapoor In Talks For Nani And Srikanth Odela New Movie

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతోనే ఈమె బాగా ఫేమస్. చాన్నాళ్ల క్రితమే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవర, RC 16 ప్రాజెక్టులపై బోలెడు ఆశలు పెట్టేసుకుంది. ఈ రెండు ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే మూడో అవకాశం కూడా పట్టేసిందట.

శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ.. 'దఢక్' సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ ఫేమ్ ఓ మాదిరిగా వచ్చింది. యాక్టింగ్ పరంగా ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'దేవర'లో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. సెప్టెంబరులో మూవీ రిలీజైతే ఈమె భవిష్యత్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)

దీనితో పాటు రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీలోనూ హీరోయిన్ జాన్వీనే. దీని షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. ఈ రెండు సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు జాన్వీని మరో ఛాన్స్ వరించిందట. 'దసరా'తో హిట్ కొట్టిన నాని-శ్రీకాంత్ ఓదెల.. మరో మూవీ కోసం పనిచేస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలవనుంది. ఇందులోనే హీరోయిన్‌గా జాన్వీని అనుకుంటున్నారట. ఆ‍ల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

తెలుగులో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇంతలోనే జాన్వీకి మూడో ఛాన్స్ అంటే ఆశ్చర్యమే. అయితే జాన్వీని తీసుకుంటే తమ సినిమాకు పాన్ ఇండియా వైడ్ మరింత రీచ్ వస్తుందని బహుశా నాని-శ్రీకాంత్ ఓదెల భావించి ఉండొచ్చు. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది.

(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement