
టాలీవుడ్‌లో హీరో నాని(Nani) నటించిన సినిమా ఏదైనా సరే మినిమమ్ గ్యారెంటీ అని ప్రేక్షకులలో అంచనాలు ఉంటాయి. వారి కోరికలు తగ్గట్లుగానే నాని నటించే చిత్రాలు వస్తుంటాయి కూడా.. విభిన్న కథలతో ఎప్పుడూ కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఆయన సిద్ధంగా ఉంటారు. నిర్మాతగా కోర్ట్ సినిమాతో తాజాగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నాని మంచి జోరు మీద ఉన్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం 'హిట్ 3' మే 1న విడుదల కానుండగా.. 'ది ప్యారడైజ్' (The Paradise) వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది.
ఇండస్ట్రీలో ఏదైనా సినిమా విడుదల తేదీ ప్రకటించాలంటే ముందుగా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవాలి.. అప్పుడే ఆ మూవీ విడుదలకు నిర్మాతలు లైన్ క్లియర్ చేసుకుంటారు. ఈ క్రమంలో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'.. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రత్యేకమైన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నాని లుక్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి మార్కులే పడ్డాయి. ఆపై అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎమ్ కూడా కలిసొచ్చింది.
ఇంకేముంది ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ. 60 కోట్లకు పైగానే నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ సెట్ అయిపోయిందని తెలుస్తోంది. ఆపై ఆడియో రైట్స్ కూడా రూ. 15 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే ఇంత మొత్తంలో సినిమా రైట్స్ కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు. ఇందులో నాని లుక్‌తో పాటు గెటప్పు.. అన్నీ ఊరనాటుగా కనిపించనున్నాయి. తిరుగుబాటు, నాయకత్వంతో పాటు తల్లీకొడుకుల అనుబంధం ఈ చిత్రానికి ప్రధాన బలమని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ,బెంగాలీతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ వంటి విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment