బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సాధారణంగా జరిగేదే. అయితే అది ఎంత వరకూ ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ‘ఉరి’ స్టార్ ఓ షోకి రాగా అందులో వీరిద్దరి బంధం గురించి హోస్ట్ టీస్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హిందీ టీవీ పరిశ్రమలో పాపులర్ షో ‘కపిల్ శర్మ షో’. దానికి కపిల్ శర్మ హోస్ట్. ఈ షోకి ఎంతోమంది బాలీవుడ్ సెటబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్ వస్తుంటారు. అలాగే తాజాగా ‘సర్దార్ ఉదం’ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా హీరో విక్కీ, డైరెక్టర్ సుజిత్ సర్కార్ వచ్చారు.
విక్కీ, క్యాట్ డేటింగ్‌లో ఉన్న విషయాన్ని మీడియాకి తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నట్లు, అసలు వాళ్ల మధ్యలో ఏం ఉందో అందరికి తెలియజేయాలని హోస్ట్ టీజ్ చేశాడు. దీంతో ఇబ్బంది పడ్డ యంగ్ హీరో నవ్వుతూ ముఖాన్ని దాచుకున్నాడు. అయితే షో జడ్జి అర్చనా పురాన్ సింగ్ మాట్లాడుతూ..‘ఈ పుకార్లు ఎంతవరకూ నిజమో తెలియదు. కానీ కపిల్ నిప్పుకి ఆజ్యం పోస్తున్నారు’ అని తెలిపింది. దీనికి స్పందనగా విక్కీ నాకు సోదరుడని, కాబట్టి నిజం చెప్పాలనివ్వాలని కపిల్ అనడం అక్కడ నవ్వులు పూశాయి. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియోని నెట్‌లో పెట్టడంతో అది వైరల్‌గా మారింది.
విక్కీ, కత్రినా గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్ని వారు ధృవీకరించలేదు కానీ పార్టీలలో కలిసి కనిపించారు. న్యూ ఇయర్ సందర్భంగా ట్రిప్‌కి కూడా వెళ్లారు.
చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో
Comments
Please login to add a commentAdd a comment