![NTR31: Prashanth Neel, Jr NTR Movie Shooting Starts Soon - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/9/jr-ntr%5D.jpg.webp?itok=yYmYoPqd)
Prashanth Neel, Jr NTR Movie Shooting Starts Soon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్‌ని పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఇక ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2, సలార్ మూవీ షూటింగ్‌లతో బిజీ కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇప్పటికే ఎన్టీఆర్‌కు ఒక లైన్ స్క్రిప్ట్ వినిపించి ఓకే అనిపించుకున్న ఆయన, ఈ ప్రాజెక్టును ‘దసరా’ రోజున లాంచ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా
నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగు కూడా మొదలవుతుందని ఫిలిం దూనియాలో టాక్. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ సెక్సెస్‌తో ఫుల్‌జోష్‌లో ఉన్న ఎన్టీఆర్, నెక్ట్ మూవీ కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మే 5న ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌లు వారి వివాహ వార్షికోత్సవాలను ఇరు కుటుంబాలతో కలిసి ఒక్కచోటే సెలబ్రెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్-లిఖిత, ఎన్టీఆర్-ప్రణతిల వివాహ వార్షికోత్సవం ఒకేరోజు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment