Jr NTR to Surprise Fans With NTR31 Update on His Birthday - Sakshi
Sakshi News home page

Jr NTR: మే 20న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ సర్‌ప్రైజ్‌!

Published Wed, May 11 2022 4:21 PM | Last Updated on Wed, May 11 2022 8:41 PM

Jr NTR To Surprise Fans With NTR31 Update On His Birthday - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నాడు. ఆయన బర్త్‌డే నాడు అంటే మే 20న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ రానుంది. అదే రోజు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉండబోతుదంట. బర్త్ డే కానుకగా  కొరటాల సినిమాతో పాటు మరో సినిమా గురించి కూడా అప్ డేట్స్ రానుందట. ఆ మూవీ ఎవరిదీ? కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌దా లేక లేక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుదా అనేది ఇప్పుడు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సస్పెన్స్‌గా మారింది. ఎన్టీఆర్‌ 31వ సినిమా డైరెక్టర్‌ ఎవరనేదానిపై ఇప్పుడు యంగ్‌ టైగర్ ఫ్యాన్స్ జోరుగా డిస్కస్ చేస్తున్నారు. టైగర్ రీసెంట్ గా కేజీయఫ్ 2 డైరెక్టర్ తో కనిపించాడు.ఆయనే 31 వ సినిమా దర్శకుడు అనేది ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.

(చదవండి: ‘బాలీవుడ్‌’ వ్యాఖ్యలపై మహేశ్‌ బాబు వివరణ)

అయితే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా చాలా కాలంగా తారక్ తో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు.ఈ దర్శకుడి తోనే టైగర్ తన 31వ చిత్రం చేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది.ఉప్పెన తర్వాత కేవలం తారక్ ను దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ జానర్ లో బుచ్చిబాబు ఒక స్టోరీ రాసిపెట్టుకున్నాడు. కేవలం తన కోసమే చాలా కాలంగా బుచ్చిబాబు వెయిట్ చేస్తుండటంతో 31వ సినిమా తారక్ తనతోనే చేస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది.

ఏది ఏమైనా 31 వ చిత్రం ఎవరితో అనేది మే 20న క్లారిటీ రానుంది. మరో వైపు ఆచార్య రిజల్ట్ తో బాగా డిస్టర్బ్ అయ్యాడు కొరటాల శివ. అందుకే షూటింగ్ కు మరింత సమయం ఇవ్వాలనుకుంటున్నాడు తారక్. ఇప్పటికే కంప్లీట్ అయిన ప్యాన్ ఇండియా స్టోరీని కొరటాల రీరైట్ చేస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. అందుకే ఈ మూవీని జూన్ నుంచి కాకుండా జులై లేదా ఆగస్ట్ నుంచి పట్టాలెక్కించాలనకుంటున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement