Bimbisara Movie Online OTT Streaming Release Date Details Inside - Sakshi
Sakshi News home page

Bimbisara Movie OTT Release: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్‌ అక్కడేనా?

Published Sat, Aug 6 2022 10:50 AM | Last Updated on Sat, Aug 6 2022 2:55 PM

Bimbisara OTT: Bimbisara Locks This OTT Platform Streaming Details Inside - Sakshi

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ అనంతరం నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ నటించిన చిత్రం బింబిసార. ఈసారి రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న(ఆగస్ట్‌ 5న) గ్రాండ్‌గా రిలీజైంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్‌టాక్‌ తెచ్చుకుంది. ట్రైం ట్రావెలర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో కల్యాణ్‌ రామ్‌ బింబిసార అనే రాజుగా కనిపించాడు.

చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య

ఇందులో కల్యాణ్‌ తన నటనలో విశ్వరూపం చూపించాడంటున్నారు నందమూరి ఫ్యాన్స్‌. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ నెట్టింట చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసి మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు గట్టిగానే పొట్టి పడ్డాయట. చివరకు ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం జీ5 ‘బింబిసార’ను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని అంటున్నారు. అంటే ఈ మూవీ అక్టోబర్‌లోనే ఓటీటీలో అందుబాటులోకి రానుందట.

చదవండి: ‘లేడీ సూపర్‌స్టార్‌’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ

మరోవైపు ఆగస్ట్‌ చివరిలో వారంలోనే రావచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా డిజిటల్‌ స్ట్రీన్‌పై బింబిసార చూడాలంటే నెలన్నరకు పైగా వేచి చూడక తప్పందంటున్నాయి సినీవర్గాలు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా కొత్త డైరెక్టర్‌ వశిష్ఠ రూపొందించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌ రామ్‌ నిర్మించిన ఈచిత్రానికి ఎమ్‌ఎమ​ కీరవాణి సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement