మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ భారీ విజయం అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇప్పటికీ సందడి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాల్ పాత్ర బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: అందుకే మాకు ఈ కఠిన పరిస్థితులు..: సునీల్ శెట్టి
ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఇప్పటికే మృణాల్‌ను ఖరారు చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. ఇక తెలుగులో ఆమెకు డిమాండ్ పెరగడంతో మృణాల్ భారీగా రెమ్యునరేషన్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది. పెద్ద ప్రొడక్షన్ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండటంతో ఆమెను వరుసగా దర్శక-నిర్మాతలు సంప్రదిస్తున్నారట.
చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు
దీంతో మృణాల్ కోటీ రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. దీంతో తొలి సినిమా అనంతరమే ఈ రెంజ్‌లో డిమాండ్ చేయడం ఏంటని దర్శక-నిర్మాతలు అవాక్కవుతున్నారట. కాగా మృణాల్ తొలుత టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరాఠిలో పలు టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మృణాల్ పాత్ర మాత్రం మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో 3, 4 పెద్ద సినిమాలతో పాటు రెండు డిజిటల్‌లో ఓ రెండు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment