గాసిప్స్ డోస్ పెంచాలి | Lakshmi Menon likes gossips about her | Sakshi
Sakshi News home page

గాసిప్స్ డోస్ పెంచాలి

Published Thu, Apr 2 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

గాసిప్స్ డోస్ పెంచాలి

గాసిప్స్ డోస్ పెంచాలి

కొందరు నాయికలు గాసిప్స్‌కు దూరంగా ఉండేలా జాగ్రత్త పడతారు. మరికొందరు గగ్గోలు పెడతారు. ఇంకొందరు గాసిప్స్‌ను ఎంజాయ్ చేస్తారు. ఈ మూడవ కోవకు చెందిన నటి లక్ష్మీమీనన్. ఈ కేరళ కుట్టిపై ఇప్పటికే పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అవిచాలవట. ఇంకా డోస్ పెంచాలంటోంది. ఈ కుంకి హీరోయిన్‌కు అదృష్టం తేనెతుట్టెలా పట్టిందనవచ్చు. తొలి చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన నాన్ శిగప్పు మనిదన్ చిత్రం వరకు వరుస విజయాలను అందుకుంది. తాజాగా కార్తీతో రొమాన్స్ చేసిన కొంభన్ గురువారం తెరపైకి వచ్చింది. నిజం చెప్పాలంటే విశాల్ తరువాత ఈ కేరళ కుట్టిస్టార్ హీరో సరసన నటించిన చిత్రం ఇదే. ఇందులో దక్షిణాది ప్రాంత పల్లెటూరి యువతిగా మరోసారి చీరకట్టులో కనిపించింది.
 
 ఇంత క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కెరీర్‌ను ప్లస్‌టూ పరీక్షల కోసం అంటూ బ్రేక్ ఇచ్చుకున్న లక్ష్మీమీనన్ ఇక నటనకు స్వస్తి చెప్పినట్లే, పై చదువుల కోసం బెంగళూరులో సెటిల్ అవబోతోందంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆమె కొన్ని చిత్రాలను నిరాకరించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో తన జానతనాన్ని ప్రదర్శిస్తూ నేను నటనకు స్వస్తి చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి నా కొచ్చిన అవకాశాలు నచ్చకపోవడంతోనే వాటిని తిరస్కరించాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే లంగా ఓణి పాత్రలు ధరించి బోర్ కొట్టేసింది. మూస పాత్రలు ధరించడం ఇష్టం లేదు. అంతకంటే ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. మాడ్రన్ గర్ల్ లాంటి పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను.
 
 అలాంటి నటనకు అవకాశం వున్న పాత్రలు లభిస్తే చేస్తాను. గ్లామర్‌గా నటిం చడానికి అభ్యంతరం లేదు. అవసరం అయితే అందుకు తగ్గట్టుగా తన శారీరకభాషను మార్చుకుంటాను. అయితే ప్రస్తుతానికి అందుకోసం ఎలాంటి కసరత్తులు చేయడం లేదు. నచ్చిన ఆహారం పుష్టిగా లాగించేస్తున్నాను. ఇక పాడడం గురించి అడుగుతున్నారు. అనూహ్యంగా వచ్చిన అవకాశాలతో ఒకటి రెండు పాటలు పాడాను. అంతేకాని అది నా వృత్తి కాదు.  అలాగే నాపై ప్రచారం అవుతున్న గాసిప్స్ గురించి స్పందించాల్సిందిగా అడుగుతున్నారు. అలాంటివి చదివి ఎంజాయ్ చేస్తున్నాను. గాసిప్స్ డోస్ పెంచాలని కోరుకుంటున్నాను కూడా. ఎందుకంటే అవి బోలెడంత ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడతాయంటోది నటి లక్ష్మీమీనన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement