పొంగల్ కు కొంభన్ | Komban joins the Pongal race | Sakshi
Sakshi News home page

పొంగల్ కు కొంభన్

Published Tue, Dec 16 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

పొంగల్ కు కొంభన్

పొంగల్ కు కొంభన్

కొంభన్ చిత్రం పొంగల్ రేస్‌కు సిద్ధం అవుతోంది. కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కొంభన్. లక్ష్మీమీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పరుత్తివీరన్ తరువాత కార్తీ గ్రామీణ పాత్రలో నటిస్తున్న చిత్రం కొంబన్. చిత్ర ఆడియోను ఈ నెలలోనూ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో విక్రమ్, ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో ఆస్కా రవి నిర్మించిన ఐ చిత్రంతోపాటు అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎ ఎం రత్నం నిర్మిస్తున్న ఎన్నైఅరిందాల్, విశాల్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న ఆంబళ చిత్రాల్లో ఉన్నారుు. దీంతో ముక్కోణపు పోటీ నాలుగు చిత్రాలకు చేరింది. మరో విషయం ఏమిటంటే కమలహాసన్ నటించిన ఉత్తమవిలన్ చిత్రం కూడా సంక్రాంతికి తె రపైకి రానున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్ర విడుదల గురించి అధికార ప్రకటనరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement