
ఏదైనా ఇండస్ట్రీలో హీరోయిన్ సూపర్ స్పీడ్ మీద ఉంటే మరో ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు ఆఫర్స్ రూపంలో వస్తుంటాయి. కన్నడం, తెలుగు ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మికా మండన్నాను వణక్కం వణక్కం (స్వాగతం) అంటూ సాధరంగా ఆహ్వానిస్తోంది తమిళ పరిశ్రమ. ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. యస్.ఆర్ ఫ్రభు, ప్రకాశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘వాంగ.. వాంగ’ (రండి.. రండి) అంటూ రష్మికను ఫిక్స్ చేశారు చిత్రబృందం. తమిళంలో రష్మికకు ఇది తొలి సినిమా. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’, నితిన్‌తో ‘భీష్మ’, కన్నడంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. మరి ఈ లక్కీ చార్మ్ తమిళంలో కూడా తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తారా? లెటజ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment