ధనుష్‌ మూవీ నుంచి ‘భీమ్లా నాయక్‌’ హీరోయిన్‌ను తప్పించారా?, ఏం జరిగింది.. | Is Heroine Samyuktha Menon Removed From Dinesh Sir Movie | Sakshi
Sakshi News home page

Actress Samyuktha Menon: సార్‌ మూవీ నుంచి హీరోయిన్‌గా సంయుక్త మీనన్‌ను తప్పించారా?

Published Tue, Jan 11 2022 9:18 PM | Last Updated on Tue, Jan 11 2022 9:27 PM

Is Heroine Samyuktha Menon Removed From Dinesh Sir Movie - Sakshi

Dhanush Sir Movie Heroine Samyuktha Menon Suddenly Walked Out: కోలివుడ్‌ స్టార్‌ హీరో, వెర్సటైల్ యాక్టర్ ధనుష్‌ నేరుగా ఓ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాష చిత్రానికి తెలుగులో ‘సార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. తమిళంలో ‘వాతి’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లో నిర్మించనున్న ఈ సినిమాకు  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోందని చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్‌ తప్పకుందంటూ షాకింగ్‌ న్యూస్‌ ఒకటి బయటకు వచ్చింది. 

చదవండి: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..

కాగా సంయుక్త మీనన్‌ భీమ్లా నాయక్‌లో రానాకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్‌ మూవీ నిర్మాత నాగవంశీనే ధనుష్‌ సార్‌ మూవీకి నిర్మాత కావడంతో పాటు, త్రివిక్రమ్‌ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్‌ భీమ్లా నాయక్‌కు స్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సార్‌ మూవీకి సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా తీసుకోవడంతో  ఫిల్మ్ సర్కిల్‌లో ఈ అప్‌డేట్‌ ఆసక్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సార్‌ మూవీ నుంచి సంయుక్త మీనన్‌ తప్పించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్‌

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండగా.. సంయుక్త షూటింగ్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై మేకర్స్ నుండి కానీ.. సంయుక్త నుండి కానీ ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె సార్‌ నుంచి తప్పుకున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సంయుక్త సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం సార్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్‌, పోస్టులు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది నిజమా కదా అన్నది చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement