టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్‌కు తిరుగులేదు. ఫ్యామిలీ అడియెన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకుల్లో కూడా మహేష్‌కు భారీ అభిమాన గణం ఉంది. టాలీవుడ్‌లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో మహేష్ ఒకరు. అంతేకాకుండా మహేష్ ప్రకటనల్లో నటిస్తూ బిజీగా ఉంటారు. అయితే ఇప్పుడు మహేష్ థియేటర్ బిజినెస్‌లోకి దిగినట్టు తెలుస్తోంది.
ఏసియన్ సినిమాస్ సంస్థతో కలసి ఆయన జాయింట్ వెంచర్ చేస్తున్నారు. గచ్చిబౌలిలో AMB మల్టీప్లెక్స్ను నవంబర్ 8న ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను మహేష్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment