
గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో నటి మలైకా అరోరాకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తాయి. యువ కథానాయకుడు అర్జున్ కపూర్‌తో షికార్లు చేస్తున్న ఈ బ్యూటి త్వరలో అతడిని పెళ్లాడనుందన్న వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయంపై అర్జున్ కపూర్, మలైకాలు ఇంతవరకు స్పందించలేదు.
తాజాగా తన ఫిట్‌నెస్ స్టూడియో ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మలైకాకు అర్జున్‌తో రిలేషన్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించిన మలైకా అరోరా, ‘నేను వ్యక్తిగత ప్రశ్నలకు ఎప్పుడూ సమాధానాలు చెప్పను. అలాంటి విషయాలు మాట్లాడటం నాకు కంఫర్టబుల్‌గా అనిపించదు. నా జీవితంలో జరిగే అన్ని విషయాలు అందరికీ తెలుసు. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడం నాకు ఇష్టముండదు. నేను నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను’ అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment