నాగశౌర్యను హీరోగా విజయాన్ని అందించిన తొలి దర్శకుడు అవసరాల శ్రీనివాసే. ఊహలు గుసగుసలాడే సినిమా విజయం సాధించడంతో హీరో నాగశౌర్యకు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు లభించింది. తరువాత నాగశౌర్య హీరోగా దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి హిట్‌లు అందుకున్నారు.
రెండో ప్రయత్నంగా జో అచ్యుతానంద సినిమాను డైరెక్ట్ చేసిన అవసరాల నాగశౌర్యకు మరో హిట్‌ను అంధించారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో నాగశౌర్య హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుక అవసరాల శ్రీనివాస్ రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదలకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment