చాలామంది ఇంటి భోజనం కంటే పొరిగింటి పుల్లకూరే రుచిగా ఉందంటూ లొట్టలేసుకుని మరి తింటుంటారు. ఎంతలా వండినా ఏవోవే వంకలతో అమ్మను బాధపెట్టే పిల్లలు ఎక్కువనే చెప్పొచ్చు. మన ఆరోగ్యం కోసమని వండినా..అమ్మ బాధ అర్థం చేసుకోం. ఎప్పుడైనా తినేందుకు ఏమి దొరకనప్పుడూ,..తిన్నవా అని అడిగేనాథుడు లేనప్పుడు కచ్చితం ఇంటి భోజనం, అమ్మచేతి వంట తప్పక గుర్తొస్తుంది ఎవరికైనా.. కదూ..!. ఇప్పుడిదంతా ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా, సెలబ్రిటీలైనా ఓ అమ్మకు పిల్లలమే..!. దిగ్గిజ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్కా తనకు నచ్చిన ఫుడ్ గురించి చెబతుంటే ఇదంతా స్ఫురిస్తుంది. ఆమె మాటలు వింటే కచ్చితంగా అమ్మ చేతి వంట అమృతాని కన్నా మిన్నా అని ఒప్పుకోక తప్పదు. ఇంతకీ ఆమె ఏమందంటే..
నటి అనుష్క శర్మ 2024లో కొడుకు అకాయ్ కోహ్లీకి జన్మనిచ్చిన తర్వాత అక్కడ కొన్ని నెలలు గడిపి ఇటీవలే ముంబైకి తిరిగొచ్చింది. ఆమె ఓ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె తన అభిమానులు, మీడియాతో మళ్లీ కనెక్ట్ అవ్వడం గురించి మాట్లాడుతూ తను సంబంధించిన ఆసక్తికకర విషయాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
మాతృత్వం, తన కాలేజ్ జ్ఞాపకాల గురించి మాట్లాడింది. ఆ టైంలో తన అమ్మ చేసే ఫుడ్ అయినా ఇష్టంగా తినేదాన్ని అని చెప్పుకొచ్చింది. తాను ఇంటి ఫుడ్‌కి పెద్ద అభిమానిని అని తెలిపింది. మనసు బాగోలేనప్పుడూ అమ్మ చేతి వంటే తనకూ మంచి బూస్టప్ అని అంటోంది. అందుకే తానెప్పుడూ అమ్మ చేతి ఫుడ్‌నే కంఫర్ట్ ఫుడ్‌గా భావిస్తానని చెప్పింది. బాగా సంతోషంగా లేదా గ్రేట్‌గా అనపించినప్పుడూ వెంటే అమ్మ చేతి భోజనం తినాల్సిందేనని అంటోంది.
అలాగే కత్రినా విక్కీ కౌశల్ తమను డిన్నర్‌కి ఆహ్వానించారని..అయితే తాము ఆరు గంటల కల్లా తిని 9.30 గంటలకే పడుకుంటామని అందువల్ల 7-7.30 కల్లా తిందామని చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చింది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. సక్రమమైన జీవనశైలితో కెరీర్‌ను అందంగా మలుచుకోవచ్చు అనడానికి విరాట్-అనుష్కాలే గొప్ప ఉదాహరణ కదూ..!
(చదవండి: బ్రూనైలో మోదీ లంచ్ మెనూ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment