శరీరంలో స్రవించే హార్మోన్లలో ఒక్కోసారి చోటు చేసుకునే కొన్ని రకాల అసమతౌల్యతల కారణంగా చాలా ఒత్తిడికి లోనవుతుండటం లేదా మూడ్ ఆఫ్ కావడం మామూలే. అయితే దాన్ని సరిచేయడానికి మందులు మింగే బదులు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలు దృఢంగా ఉంటాయి. ఆ ఆహారాలేమిటో తెలుసుకుని, మూడ్ బాగుండనప్పుడు వాటిని తీసుకుంటే సరి!
మూడ్‌ని మార్చే ఫుడ్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మూడ్ పాడవుతుంది. ఏదో పోగొట్టుకున్నట్లు... వెలితిగా... ఒకలాంటి బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వెంటనే మూడ్ సరవుతుంది. అవేమిటో తెలుసుకుందాం...
పాలకూర.. ఐరన్ పాళ్లు అధికంగా ఉండే పాలకూర సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర స్మూతీ, సూప్ లేదా పాలకూరను ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మష్రూమ్స్.. మష్రూమ్స్ యాంటి డిప్రెసెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ డి మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ఇది సెరటోనిన్ సంశ్లేషణ స్థాయికి సంబంధించినది. దీని కారణంగా వ్యక్తి సంతోషకరమైన భావోద్వేగాలను అనుభవించగలడు. మీ మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, మష్రూమ్ రెసిపీని తినడం వల్ల తిరిగి మంచి మూడ్‌లోకి వచ్చేసే అవకాశం మెండుగా ఉంది. ప్రయోజనకరంగా ఉంటుంది.
అవకాడో.. కొద్దికాలం క్రితం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి3 ,ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్‌లు సంతోషకరమైన హార్మోన్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. రోజంతా సంతోషంగా ఉండటానికి సలాడ్, శాండ్‌విచ్ లేదా అల్పాహారంలో అవకాడోను చేర్చవచ్చు.
డ్రై ఫ్రూట్స్.. ప్రతిరోజూ కొన్ని బాదం లేదా వాల్‌నట్‌లను తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇలా జరుగుతుంది.
డార్క్ చాకొలేట్.. ఓ నివేదిక ప్రకారం డార్క్ చాకొలేట్ తినడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయులను పెంచుతుంది. ఫలితంగా వెంటనే మూడ్ సరవుతుంది.
మూడ్ బాగుండనప్పుడు ఈ ఫుడ్ ప్రయత్నించండి.
(చదవండి: మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!)
Comments
Please login to add a commentAdd a comment