మహిళ ప్రెగ్నెంట్‌గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఏంటిది ఎలా సాధ్య? అసలు ఇలా ఎవరికైనా జరిగిందా? అని పలు సందేహాలు మొదలయ్యాయి కదా. కానీ నిజానికి ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్‌ఫెటేషన్ అని పిలుస్తారని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి.
ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్‌ఫెటేషన్ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కేట్ హిల్ అనే మహిళకు ఇలానే జరిగింది. ఆమె కేవలం పది రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది.
ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు ఒకే రోజు జన్మించినప్పటికీ వారి బరువులు, పరిమాణలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఇలాంటి సూపర్‌ఫెటేషన్ జంతువులలో కూడా జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలు, కంగారులు, కుందేళ్లు, పిల్లి జాతులు, గొర్రెలు అన్ని సూపర్‌ఫెటేషన్‌కు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. చేపలు కూడా ఇదే విధమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!)
Comments
Please login to add a commentAdd a comment