pregnant again
-
ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగలరా? ఇది సాధ్యమేనా!
మహిళ ప్రెగ్నెంట్‌గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఏంటిది ఎలా సాధ్య? అసలు ఇలా ఎవరికైనా జరిగిందా? అని పలు సందేహాలు మొదలయ్యాయి కదా. కానీ నిజానికి ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్ఫెటేషన్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి. ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్ఫెటేషన్ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కేట్ హిల్ అనే మహిళకు ఇలానే జరిగింది. ఆమె కేవలం పది రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు ఒకే రోజు జన్మించినప్పటికీ వారి బరువులు, పరిమాణలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఇలాంటి సూపర్ఫెటేషన్ జంతువులలో కూడా జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలు, కంగారులు, కుందేళ్లు, పిల్లి జాతులు, గొర్రెలు అన్ని సూపర్ఫెటేషన్కు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. చేపలు కూడా ఇదే విధమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. ఐపీఎల్ ట్రోఫీతో పాటు..?
MS Dhoni And Sakshi Dhoni Expecting Their Second Child In 2022: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగోసారి(2010, 2011, 2018, 2021) విజేతగా నిలిపి ఆ ఫ్రాంఛైజీ అభిమానులు గర్వపడేలా చేసిన మహేంద్ర సింగ్ ధోని.. తన ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. ధోని రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అతని భార్య సాక్షి సింగ్ రావత్ స్నేహితురాలు, సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాక్షి రావత్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని.. వచ్చే ఏడాదిలో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ప్రియాంక రైనా పేర్కొన్నట్లు సమాచారం. నిన్న సీఎస్కే ట్రోఫీ గెలిచిన అనంతరం సాక్షి, కుమార్తె జీవాతో కలిసి మైదానంలోకి వచ్చి సందడి చేశారు. ఆ సమయంలో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపించడంతో ధోని అభిమానులు విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో ధోని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా లభించినట్లైంది. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి, నాలుగోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మొయిన్ అలీ (37) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్‌మన్ గిల్ (51) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిగతా బ్యాటర్లంతా తేలిపోవడంతో మోర్గాన్ సేన ఓటమిపాలై, మూడోసారి కప్‌కు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. చదవండి: తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి -
స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది!
జెనీలియా మళ్లీ తల్లి కానున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో అందరూ ఆసక్తికరంగా చర్చిస్తున్న టాపిక్ అది. జోరుగా షికారు చేస్తున్న ఈ వార్తకు జెనీలియా కానీ, ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ కానీ స్పందించలేదు. మౌనం అర్ధాంగీకారం అంటారనీ, ప్రస్తుతం జెనీలియా గర్భవతి అనీ చాలామంది ఫిక్స్ అయ్యారు. దాచినా దాగదు కాబట్టి, కొన్ని నెలలు ఆగితే అసలు విషయం తెలిసిపోతుంది. జెనీలియా ఇప్పటికే ఒక బాబుకు తల్లి. ముద్దుల కొడుకు రియాన్ మొదటి బర్త్‌డేను మొన్న నవంబర్ 25న ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మతనంలోని తీయదనం గురించి జెనీలియా ఏం చెబుతున్నారంటే... బిడ్డ పుట్టినప్పుడు తల్లి మనోభావాలు విచిత్రంగా ఉంటాయి. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని కంగారుపడిపోయేదాన్ని. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం ఉండేది. బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాను. రాత్రింబవళ్లూ రియాన్ గురించే. కొంతమంది పిల్లలు రాత్రిపూట అదే పనిగా ఏడవడం నేను స్వయంగా చూశాను. మా అబ్బాయి కూడా అలానే చేస్తాడని కంగారుపడ్డాను. కానీ, రియాన్ చక్కగా నిద్రపోయేవాడు. మొదటిసారి బిడ్డను కన్న తల్లికి చుట్టూ ఉన్నవాళ్లు ఏవేవో సలహాలిస్తుంటారు. వాటిల్లో ఏది పాటించాలో తెలియక డైలమాలో పడిపోతాం. అందుకే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లుంటే వాళ్ల సలహాలను పాటించాలి. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయితే మాతృత్వాన్ని ఎంజాయ్ చేయలేం. అందుకే కొత్తగా తల్లయినవాళ్లు ఎలాంటి అపోహలూ, భయాలూ పెట్టుకోకుండా మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేయమని చెబుతున్నాను. నా బిడ్డకు సంబంధించిన ప్రతి పనీ నేనే స్వయంగా చేస్తాను. సాయంత్రం అయ్యేసరికి బాగా అలసి పోతాను. ఆ అలుపు చాలా తియ్యగా ఉంటుంది. మా అబ్బాయిని పెంచడం మొదలుపెట్టాక నన్ను పెంచిన మా అమ్మ మీద గౌరవం పెరిగింది. అమ్మ కూడా నా మీద ఇంత ప్రాణం పెట్టుకుని, పెంచి ఉంటుంది కదా అనిపించింది. నా ప్రెగెన్న్సీని డాక్టర్ కన్ఫర్మ్ చేయగానే, ‘నువ్వు మాత్రమే కాదు.. నేను కూడా ప్రెగ్నెంటే. ఈ తొమ్మిది నెలల కాలంలో శారీరకంగా నీలో వచ్చే మార్పులు నాకు రాకపోవచ్చు. నీ కష్టాలు కూడా తెలియదు. కానీ, అడుగడుగునా నీకు తోడుంటా’ అని నా భర్త రితేశ్ అన్నప్పుడు చాలా అదృష్టవంతు రాల్ని అనిపించింది. ఆయన మంచి భర్త మాత్రమే కాదు... మంచి తండ్రి కూడా. పిల్లవాడికి డైపర్స్ మారుస్తాడు. స్నానం చేయిస్తాడు. రాత్రి పాలు తాగించేటప్పుడు తను కూడా మేల్కొనే ఉంటాడు. బిడ్డను పెంచడం కేవలం నా ఒక్కదాని బాధ్యత మాత్రమే అని తనెప్పుడూ అనుకోలేదు. పెళ్లయిన తర్వాత నేనేం మారలేదు. అమ్మ అయ్యాక కూడా మారలేదు. నాలో వచ్చిందల్లా శారీరక మార్పు మాత్రమే. ఆ మార్పును నేను ఆనందంగా అంగీకరిస్తున్నా. ఎందుకంటే, మనం పుట్టిన తర్వాత మన అమ్మ ఇలా బబ్లీగా అయ్యిందని నా కొడుకు తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం సినీనటిగా లైమ్ లైట్లో లేననే బాధ ఇసుమంత కూడా లేదు. అంతకు మించిన ఆనందాన్ని అనుభవిస్తున్నా. అప్పుడప్పుడూ మాత్రమే బయటికి వస్తున్నా. ఆ రిలీఫ్ చాలు. నేను, రితేశ్ మా అబ్బాయి లేకుండా బయటికి వెళ్లం. మేం పిల్లవాడితో కనిపిస్తే చాలు ఫొటోలు తీసేస్తుంటారు. అలా చేయడం మాకు ఇబ్బందిగా ఉంటుంది. అది గ్రహించి ఎవరికి వాళ్లు తమ కెమెరాలను క్లిక్‌మనిపించకుండా ఉండాలని కోరుకుంటాం. ఒకవేళ తీసినా మొహం అదోలా పెట్టుకోం. నిజం చెప్పాలంటే అమ్మను అయ్యాక స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది. ప్రతి నెలా బిడ్డలో వచ్చే మార్పు, ఎదుగుదల చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంటుంది. అందుకే అంటారేమో... ‘మదర్‌హుడ్ ఈజ్ మేజికల్’ అని!