తాడిపత్రి : తాడిపత్రి మున్సిపాలిటీలో స్వచ్ఛభారత్ అమలులో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం బాగుందని క్వాలిటీ కంట్రోల్ ఢిల్లీ బృందం ప్రశంసించింది. బృంద సభ్యులు అరవింద్, గిరిబాబు గురువారం తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్, సంజీవనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, మేనేజర్ సాయిశంకర్, డీఈఈ రఘుకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు.
స్వచ్ఛభారత్ కింద మొత్తం 4,200 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. వాటిని వినియోగిస్తున్న విధానాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. రోడ్లు, పచ్చని చెట్లను చూసి ముగ్దులయ్యారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
తాడిపత్రిలో స్వచ్ఛభారత్ భేష్
Published Fri, Sep 23 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement