hand washing
-
చేతులు కడుక్కుందాం..ఆరోగ్యంగా ఉందాం..!
Global Handwashing Day 2024: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్) అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి గాను దీన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలిసి 2008లో ‘గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ పార్ట్నర్షిప్ సముదాయంగా రూపొందాయి. ఆనాటి నుంచి దాదాపు 100కు పైగా దేశాల్లోని వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్కూళ్లు, ప్రైవేటు సంస్థలు ఈ రోజున చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై అవగాహన కల్పిస్తున్నాయి. ఈ ఏడాది థీమ్ : ‘‘శుభ్రమైన చేతులు ఎందుకు అవసరమంటే’’? ఈ పొరబాట్లు చేయకండి... చేతులు కడుక్కోవడం అందరికీ తెలిసిన విద్యే. ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేమీ లేవు. రెండుమూడేళ్ల కిందట కరోనా వచ్చినప్పుడు మందులూ, మాకులూ, వ్యాక్సిన్ల కంటే ముందుగా అందరి ప్రాణాలు రక్షించింది ఈ చేతులు కడుక్కోవడమనే పనే. చేతులు కడుక్కోవడంలో చేసే కొన్ని పొరబాట్లను సరిదిద్దుకోవడమెలాగో చూద్దాం.సబ్బును మరవకండి: వాష్ బేసిన్లో నల్లా / కొళాయి కింద చేతులుంచినా చేతులు కడుక్కున్నట్టే. కానీ హానికరమైన మురికి అంతా తొలగి΄ోవాలంటే సబ్బును వాడాల్సిందే. మొక్కుబడిగా వద్దు: చేతులు కడిగేదే మురికినంతా శుభ్రం చేసుకోడానికి. అందువల్ల సబ్బు రాసుకున్న చేతివేళ్లను శుభ్రంగా కనీసం 20 సెకన్ల పాటు రుద్దుకుంటూ కడగాలి. పొడిగా అయేంతవరకు ఆగండి: చేతుల్ని శుభ్రం చేసుకున్న వెంటనే ఆ తడిచేతులతోనే ఏదైనా పనికి ఉపక్రమించడం సరికాదు. తడి చేతులు పొడిగా అయ్యేవరకు ఆగి అప్పుడు తినడం లేదా ఏదైనా పనిచేయడం మొదలుపెట్టాలి. ఒకసారి చేతులు శుభ్రంగా కడిగాక తినడం లేదా ఏదైనా పని చేయడం పూర్తయ్యే వరకు మురికిగా ఉండే ఉపరితలాలను తాకడం సరికాదు. ఆదరాబాదరా అసలే వద్దుకొందరు చేతులు కడుక్కునేటప్పుడు ఆదరాబాదరా కడిగేసుకుంటారు. రెండు వేళ్లకూ మధ్యనుండే చోట్ల లేదా గోర్ల చివరల్లో అంతగా శుభ్రం చేసుకోరు. చేతులు కడుక్కోవడం అంటే వేలికీ వేలికీ మధ్యనుండే చోట్లలో, అలాగే గోర్ల కింద కూడా శుభ్రంగా కడుక్కోవాలి. చదవండి: అలాంటి జన్యువులు ఉంటే బరువు తగ్గడం ఈజీ..! -
Health Tips: వర్షాకాలం.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. వేడి నీటితో స్నానం చేస్తే!
సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా.. ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. తడిసిన తరువాత స్నానం చేయాలి మనమందరం వర్షంలో తడిసి ఆనందిస్తుంటాం.. అందులోనూ చిన్నారులు మరింత ఉత్సాహం చూపిస్తుంటారు. వర్షంలో తడిసిన తరువాత తప్పకుండా స్నానం చేయాలి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబును నివారించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. నీరు తాగాలి ఈ సమయంలో తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో ప్యాక్డ్ వాటర్, కియోస్క్‌లు, ధాబాస్ లేదా షాపుల నుంచి వడకట్టని నీటిని తాగరాదు. వాటర్ ప్యూరిఫైయర్ నుంచి మాత్రమే నీరు తాగండి. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. వెంటిలేషన్ ఉండాలి మనం ఎక్కువ సమయం గడిపే స్థలం కూడా వర్షాకాలంలో ప్రభావితం చేస్తుంది. ఇరుకైన ప్రదేశంలో ఉంటే అంటు వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతుంటాయి. వీలైనప్పుడల్లా ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. తప్పకుండా చేతులు కడుక్కోవాలి వాష్‌రూమ్ డోర్, ట్యాప్, ఫ్లష్ మొదలైన వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన చేతుల్లోకి వస్తాయి. మీరు భోజనానికి ముందు ఆ తరువాత తప్పనిసరిగా సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇది అంటువ్యాధులను నివారించడానికి మీకు సహాయపడుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచండి వర్షాకాలంలో ఇంట్లో చాలా దుమ్ము వచ్చి చేరుతుంది. వర్షంతో వచ్చే తడితో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి. అవి అంటువ్యాధులను, ఇన్ఫెక్షన్లను మోసుకొస్తుంటాయి. సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఇంటి శుభ్రతతో దోమలు, ఇతర కీటకాల పెంపకాన్ని నివారించవచ్చు. ఇది వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా తగ్గిస్తుంది. ►చర్మ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వేడినీటితో రోజు రెండు పూటలా స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, క్రిములు తొలగిపోతాయి. అలర్జీలు దరి చేరకుండా చూసుకోవచ్చు. చదవండి: Rainy Season Healthy Diet: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్ వద్దు.. ఇవి తినండి! Health Tips: ఖాళీ కడుపుతో ఇవి తింటే చాలా డేంజర్..! అవి కూడా అతిగా వద్దు! 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! -
6 లక్షల మంది ఒకేసారి చేతులు కడుక్కున్నారు!
వడోదర: మనకు సంక్రమించే అనేకరకాల వ్యాధులకు బ్యాక్టీరియాలు, వైరస్‌లే కారణమనే విషయం తెలిసిందే. చేతులు కడుక్కోకుండా తినడం వల్లే ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే తినేటప్పుడు చేతులు కడుక్కోవాలనే విషయమై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గుజరాత్లో ఓ పే..ద్ద కార్యక్రమం జరిగింది. నర్మదా జిల్లాలో ఒకేసారి 6 లక్షల మంది చేతులు కడుక్కున్నారు. నర్మదా జిల్లాలోని 561 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినందున గుజరాత్లో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించి, బహిరంగ మల, మూత్ర విసర్జనలేని మొదటి జిల్లాగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. తిలకోడా నియోజకవర్గంలోని కలగోడా గ్రామంలో ప్రధాన కార్యక్రమం జరగగా, మిగతా 560 గ్రామాల్లో కూడా ఒకేసారి చేతులు కడుక్కునే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి లక్ష్మీబెన్ భావని కూడా పాల్గొన్నారు. పారిశుద్ధ్యాన్ని పాటిస్తే ఎటువంటి లాభాలుంటాయో ప్రజలకు వివరించారు. -
చేతుల శుభ్రతలో గిన్నిస్ రికార్డు
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్వచ్ఛ సత్తెనపల్లిలో భాగంగా సోమవారం 1410 మంది విద్యార్థులు వేగంగా చేతులు శుభ్రం చేసుకుని గిన్నిస్‌బుక్ రికార్డు నమోదు చేశారు. గతంలో జార్ఖండ్ రాష్ట్రంలోని జంషడ్‌పూర్‌లో 991 మంది విద్యార్థులు వేగంగా చేతులు శుభ్రం చేసుకుని రికార్డు నమోదు కాగా, దానిని సత్తెనపల్లి విద్యార్థులు అధిగమించారు. ఈ కార్యక్రమంలో 3.40 గంటల్లో (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 6.10 వరకు)1410 మంది విద్యార్థులు సామూహికంగా చేతులు శుభ్రం చేసుకున్నారు. గిన్నిస్‌బుక్ ప్రతినిధి లూసియానా 1410 మందితో జరిగిన కార్యక్రమంతో సత్తెనపల్లి గిన్నిస్‌బుక్ రికార్డులో నమోదైనట్లు ప్రకటించి, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పత్రం అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు నమోదు కావడం సంతోషకరమన్నారు. అరుదైన రికార్డు లభించిన సందర్భంగా కోడెలను ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరించారు. సభలో స్పీకర్ ఓఎస్డీ గురుమూర్తి, డీఆర్వో నాగబాబు, యునెసఫ్ ప్రతినిధి ప్రమోద్‌సేన్, మున్సిపల్ చైర్మన్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.