6 లక్షల మంది ఒకేసారి చేతులు కడుక్కున్నారు! | Gujarat sets world record for Hand Washing in Narmada District | Sakshi
Sakshi News home page

6 లక్షల మంది ఒకేసారి చేతులు కడుక్కున్నారు!

Published Fri, Aug 12 2016 1:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

6 లక్షల మంది ఒకేసారి చేతులు కడుక్కున్నారు!

6 లక్షల మంది ఒకేసారి చేతులు కడుక్కున్నారు!

వడోదర: మనకు సంక్రమించే అనేకరకాల వ్యాధులకు బ్యాక్టీరియాలు, వైరస్‌లే కారణమనే విషయం తెలిసిందే. చేతులు కడుక్కోకుండా తినడం వల్లే ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే తినేటప్పుడు చేతులు కడుక్కోవాలనే విషయమై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గుజరాత్‌లో ఓ పే..ద్ద కార్యక్రమం జరిగింది. నర్మదా జిల్లాలో ఒకేసారి 6 లక్షల మంది చేతులు కడుక్కున్నారు.

నర్మదా జిల్లాలోని 561 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినందున గుజరాత్‌లో  100 శాతం మరుగుదొడ్లు నిర్మించి, బహిరంగ మల, మూత్ర విసర్జనలేని మొదటి జిల్లాగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

తిలకోడా నియోజకవర్గంలోని కలగోడా గ్రామంలో ప్రధాన కార్యక్రమం జరగగా, మిగతా 560 గ్రామాల్లో కూడా ఒకేసారి చేతులు కడుక్కునే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి లక్ష్మీబెన్ భావని కూడా పాల్గొన్నారు. పారిశుద్ధ్యాన్ని పాటిస్తే ఎటువంటి లాభాలుంటాయో ప్రజలకు వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement